రాహుల్ గాంధీ ఓవరాక్షన్ చూతము రారండీ!
posted on: Jul 9, 2014 2:40PM
.jpg)
వంద సంవత్సరాల వయసు దాటిన కాంగ్రెస్ పార్టీకి దేశంలో నూరేళ్ళూ నిండేలా చేసిన ఘనత శ్రీమతి సోనియాగాంధీకి, మాస్టర్ రాహుల్ గాంధీకి దక్కింది. రాజీవ్ గాంధీ భార్య, కొడుకు కావడం మినహా ఎలాంటి రాజకీయ పరిపక్వత లేని వీళ్ళిద్దరి చేతిలో చిక్కుకుపోయిన కాంగ్రెస్ పార్టీ చిక్కుల్లో కూరుకుపోయి, మొన్న జరిగిన ఎన్నికలలో దిక్కూదివాణం లేకుండా పోయింది. ఈ ఎన్నికలలో భవిష్యత్తులో కూడా దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని, ఆమాటకొస్తే కాంగ్రెస్ పార్టీ కొన్నేళ్ళ తర్వాత కాంగ్రెస్ పార్టీ అడ్రస్ కూడా లేకుండా పోయే అవకాశం వుందన్న క్లారిటీ రాజకీయ పరిశీలకులకు వచ్చేసింది. అందరికీ వచ్చిన క్లారిటీ రాహుల్ గాంధీకి రాకుండా వుంటుంది. ఈ క్లారిటీ ఆయనకి కూడా వచ్చే వుంటుంది. కానీ ఏమీ రానట్టే కనిపిస్తున్నారు. మూడు రోజుల క్రితం పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా పార్లమెంటులోనూ, పార్లమెంటు ఆవరణలోనూ రాహుల్ గాంధీని చూస్తున్న జనం బిత్తరపోతున్నారట. ఎందుకంటే ఆయన ఈ మూడు రోజులుగా చాలా ఉత్సాహంగా కనిపిస్తూ వున్నారు. ఎప్పుడు చూసినా అందర్నీ నవ్వుతూ పలకరిస్తున్నారట. అధికారంలో ఉన్నప్పటికంటే చాలా ఉత్సాహంగా కనిపిస్తున్నారట. భారత ప్రజలు తమని, తమ పార్టీని ఇంటికి సాగనంపారన్న దిగులు ఏ కోశానా ఆయన ముఖంలో కనిపించడం లేదట. తన జీవితంతో ఎప్పుడూ ఎవరినీ పలకరించి ఎరుగని వాళ్ళని కూడా పేరు పెట్టి మరీ పిలిచి పలకరిస్తూ చాలా ఉల్లాసంగా మాట్లాడుతున్నారట. రాహుల్ గాంధీ ఈ యవ్వారమంతా చూసి కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆయన గారి మాతృమూర్తి సోనియాగాంధీ మురిసిపోతూ వుండొచ్చేమోగానీ, మిగతా రాజకీయ వర్గాలు మాత్రం రాహుల్ గాంధీ చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నారని అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఓటమి తెచ్చిన అవమాన భారంలో పీకలదాకా కూరుకుపోయి వున్న రాహుల్ గాంధీ తన బాధ బయటకి తెలియకుండా వుండటం కోసం ఇలా అతి ఉల్లసాన్ని ప్రదర్శిస్తున్నారని భావిస్తున్నారు. రాహుల్ గాంధీ దిగులుగా ఓ మూలన కూర్చుని వుంటే చూసేవాళ్ళకి పెద్దగా ఇబ్బందేమీ వుండదని, అయితే ఇలా అతి ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని ప్రదర్శించడాన్నే చూడలేకపోతున్నామని అంటున్నారు. అంచేత రాహుల్ గాంధీ తన ఓవర్ యాక్షన్ని ఆపితే మంచిదని భావిస్తున్నారు.



.jpg)


.webp)



