రాహుల్ గాంధీకి సత్తా ఉందా.. మోడీకి అవే బలమా...

 

ఎప్పటినుండో ఎదురుచూస్తున్న కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కోరిక త్వరలో తీరనుంది. మరో నాలుగు రోజుల్లో పార్టీ పగ్గాలు ఆయన చేతికి వెళ్లనున్నాయి. ఇప్పటికే రాహుల్ గాంధీ ఎన్నికలో భాగంగా... నామినేషన్ ప్రక్రియ ముగిసింది. అంతేకాదు ఈ ప్రక్రియలో రాహుల్ గాంధీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.  అధ్యక్షపదవికి రాహుల్‌ మినహా ఎవరూ నామినేషన్‌ వేయకపోవడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. డిసెంబర్‌ 16న ఆయన అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్నారు.దీంతో నెహ్రూ-గాంధీ ఫ్యామిలీ నుంచి అధ్యక్ష బాధ్యతలు చేపడుతున్న ఐదోవ్యక్తి రాహుల్ అయ్యారు‌.

 

అయితే ఇక్కడ వరకూ బాగానే మరి రాహుల్ కు పార్టీని నడిపించగలిగే సత్తా ఉందా..? అన్నది పెద్ద ప్రశ్నగా మారింది. ఎందుకంటే.. రాహుల్ గాంధీకి ఉన్న స్టామినా గురించి అందరికీ తెలిసిందే. ప్రతిపక్ష నేతలు అయితే రాహుల్ గాంధీని ఆడుకుంటారు. ఏకంగా పప్పు అనే పిలుచుకుంటారు. ఏజ్ పెరిగింది కానీ... మైండ్ ఎదగలేదు అని అబ్బో ఒకటి కాదు రెండు కాదు ఎన్నో విమర్శలు గుప్పించేవారు. అంతేకాదు అప్పుడప్పుడు పార్లమెంట్ సమావేశాల్లో పడుకోవడం..కెమెరా కంటికి చిక్కడం..బుక్ అవ్వడం.. కూడా రాహుల్ ఇమేజ్ ను డామేజ్ చేసేశాయి. ఇక పార్టీ నేతలు కూడా రాహుల్ కు పార్టీ పగ్గాలు ఇవ్వాలంటే కాస్త సందేహపడ్డారు కూడా. అందుకే ఎప్పుడో ఇవ్వాల్సిన బాధ్యతలు పెండింగ్ పడుతూ ఇప్పుడు చేపట్టనున్నారు.

 

మరోవైపు రాహుల్  కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్న ఆ పార్టీ భావి ప్రధాన మంత్రి అభ్యర్ధి రాహుల్ గాంధీకి రాజకీయం చదరంగంలో కొన్ని బలహీనతలు ఉన్నాయి.. అవే మోడీకి బలాలు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అవి ఏమిటో ఒక లుక్ వేద్దాం ..రాహుల్ గాంధీ రాజకీయ జీవితాన్ని గమనిస్తే సమయానికి తగ్గట్లు నిర్ణయాలు తీసుకోవడంలో రాహుల్ విఫలమవుతున్నారు .ఉదాహరణకు మధ్యప్రదేశ్ ,ఓడిశా రాష్ట్రాల పీసీసీ అధ్యక్షా పదవులను నియమించడానికి గత ఆరు నెలలుగా సంప్రదింపులు చేస్తున్న కానీ ఇప్పటివరకు ఆ విషయంలో క్లారీటీ లేదు .అంతే కాదు లోక్ సభలో పార్టీ ఉపనేతగా ఉన్న అమరేందర్ సింగ్ రాజీనామా చేసిన కానీ ఉప నేత పదవిని ఇంతవరకు రాహుల్ నియమించలేదు . రాహుల్ చేస్తోన్న పలు ప్రసంగాలను చూస్తుంటే ఆయన మాటల్లో ఎదుటివార్ని ఆకర్షించే విధంగా ఉండవు .అంతే కాదు సమయానికి తగ్గట్లు ఫంచ్ లు ఉండవు ..విమర్శలు ఉండవు ..సెటైర్లు ఉండవు ..ఆయన పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న ..ఇక్కడ పాలన సరిగా లేని సమయంలో రాహుల్ ఏకంగా సెలవులు పెట్టి మరి ఇతర దేశాల పర్యటనలకు వెళ్తారు .పార్టీ వ్యవహారాల్లో మినహా ప్రభుత్వ సంబంధిత పనుల్లో ఎటువంటి అనుభవం లేదు .ఇవే ప్రధాని మోదీకి బలంగా మారనున్నాయి అని రాజకీయ విశ్లేషకులు.

 

వీటన్నింటికన్నా ముందు తక్షణమే ఎదురవుతున్న ప్రశ్న రాహుల్‌ గాంధీ నాయకత్వాన జరిగిన ఎన్నికల ప్రచారంలో గుజరాత్‌లో పార్టీ విజయం సాధిస్తుందా, లేదా? అన్నది అనుమానం. ఎందుకంటే కొత్త బాధ్యతలు స్వీకరించిన వెంటనే పరాజయం ఎదురయితే అది రాహుల్ గాంధీకి పెద్ద మైనస్ అవుతుంది. వచ్చే ఏడాది మొదట్లో జరుగనున్న కర్ణాటక అసెంబ్లీ, ఆ తర్వాత రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికలు ఆయన నాయకత్వానికి సవాల్‌గా నిలుస్తాయి. మరి రాహుల్ గాంధీ ఇవన్నీ తట్టుకొని ముందుకు సాగగలడా... రాహుల్ లోపాలను మోడీ ఎలా ఉపయోగించుకుంటాడో చూద్దాం..