Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...నేను ఏ పౌరసత్వాన్నీ కోరలేదు... రాహుల్‌గాంధి
posted on: Mar 25, 2016 11:01AM
.jpg)
తాను బ్రిటిష్ పౌరుడినంటూ రాహుల్‌గాంధి ఇచ్చిన ఓ వాంగ్మూలం ఆయనను చిక్కుల్లో పడేసిన విషయం తెలిసిందే! భారత రాజ్యాంగం ప్రకారం ఇక్కడి పౌరులు మాత్రమే ఎన్నికలలో పోటీ చేయగలరు కాబట్టి, రాహుల్ గాంధిని పార్లమెంటు నుంచి బహిష్కరించాలంటూ బీజేపీ పట్టుపడుతోంది. గత ఏడాది బీజేపీ నాయకుడు సుబ్రహ్మణ్య స్వామి ఈ విషయాన్ని లేవనెత్తినప్పటి నుంచీ ఈ వివాదం మరింతగా రాజుకుంటూనే ఉంది. తాజాగా పార్లమెంటు నైతిక ప్రవర్తన సంఘం కూడా రాహుల్‌ను సంజాయిషీ కోరడంతో, కాంగ్రెస్ శిబిరం అయోమయంలో పడిపోయింది.
కానీ రాహుల్ మాత్రం ఈ విషయమై చాలా నిబ్బరంగా ఉన్నారట. తాను పౌరసత్వం కోసం ఎక్కడా ఏ దరఖాస్తూ చేసుకోలేదంటూ, ఆయన నైతిక ప్రవర్తన సంఘానికి బదులిచ్చారట. మరి అలాంటప్పుడు తాను బ్రిటన్ పౌరుడినంటూ, అక్కడి కంపెనీకి చెందిన పత్రాలలో ఆయన సంతకం ఎలా చేశారన్నది ఇప్పుడు బీజేపీ నేతలు సంధిస్తున్న ప్రశ్న! రాహుల్ దానికి ఎలాంటి జవాబిస్తారో!






