Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఆ క్రెడిట్ నాదే- రాహుల్
posted on: Mar 8, 2016 4:13PM
.jpg)
ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ భవిష్యనిధి మీద విధించిన పన్నుని రద్దు చేస్తున్నట్లు ఇలా ప్రకటించారో లేదో, అలా రాహుల్ గాంధి నోరు విప్పేశారు. ప్రభుత్వం మీద తను తీసుకువచ్చిన ఒత్తిడి కారణంగానే, వారు ఇలాంటి నిర్ణయాన్ని తీసుకున్నారనీ, అందుకు తనకెంతో సంతోషంగా ఉందనీ చెప్పుకొచ్చారు. ఆర్థికమంత్రి మొన్న బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ భవిష్యనిధి నుంచి తీసుకునే సొమ్ములో 60% పన్ను పరిధిలోకి వస్తుందని ప్రకటించిన విషయం తెలిసిందే.
ఈ ప్రకటన గురించి సాక్షాత్తూ ప్రధాని నరేంద్ర మోదీతో సహా నిరసనలు వ్యక్తం చేయడంతో, మంత్రిగారు తన ప్రకటనను వాపసు తీసుకున్నారు. అయితే ఈ క్రెడిట్ అంతా తనదేనని రాహుల్ చెప్పడంతో కాంగ్రెస్ వర్గాలు సైతం విస్తుపోతున్నాయి. ముందుముందు ప్రభుత్వం ఇలాంటి ప్రకటనలు చేసిన ప్రతిసారీ, తనవల్లే అదంతా జరిగిందని రాహుల్‌గారు అంటే ఏం చేసేది అంటూ ఇటు బీజేపీ నేతలూ తలపట్టుకుంటున్నారు. మొత్తానికి రాహుల్ మాటల వెనుక మర్మం ఏమిటో ఎవరికీ తెలియదు సుమా!


.jpg)
.jpg)


