మోదీ నన్ను తిట్టారు- రాహుల్‌ ఆక్రోశం

posted on: Mar 4, 2016 4:03PM

 

ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, అసోంలో పర్యటిస్తున్న రాహుల్‌ గాంధి మరోసారి ప్రధానమంత్రి మీద విరుచుకుపడ్డారు. మోదీ నిన్న గంటా పదిహేను నిమిషాల సేపు పార్లమెంటులో చేసిన ఉపన్యాసంలో, తనని తిట్టేందుకే అధికప్రాధాన్యతని ఇచ్చారని విమర్శించారు. ‘మీకు సంతోషం కలిగితే అలాగే తిట్టుకోండి, కానీ నా ప్రశ్నలకు జవాబు ఇవ్వండి’ అంటూ ఆవేశపడిపోయారు. 15 సంవత్సరాలుగా అసోంను ఏలుతున్న కాంగ్రెస్‌నే ఈసారి కూడా ఎన్నుకోమనీ, ప్రత్యర్థి కూటమి మాటలు నమ్మి మోసపోవద్దనీ రాహుల్ ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

అయితే మోదీ తనను తిట్టే ముందు తాను కూడా ఆయనను తెగ విమర్శించిన విషయం మాత్రం రాహుల్‌ ప్రస్తావించలేదు. మోదీ ఎవరి మాటా వినరనీ, తాను ఈ దేశ ప్రధానమంత్రి అన్న విషయాన్ని మర్చిపోతూ ఉంటారనీ, తన మనసుకి ఏది తోస్తే అది చేస్తారనీ నిన్నగాక మొన్న రాహుల్‌గాంధి, మోదీని ఏకిపారేసిన విషయం తెలిసిందే! అందుకు మోదీ కూడా నిన్న దీటుగా జవాబునిచ్చారు. కొంతమంది ఎదుగుతారే కానీ, వారి బుద్ధి మాత్రం ఎదగదు అంటూ పరోక్షంగా రాహుల్‌ని దెప్పిపొడిచారు. పాపం! మోదీ మాటలకు రాహుల్‌బాబు మనసు బాగా గాయపడినట్లుంది.

google-ad-img
    Related Sigment News
    • Loading...