Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...రాహుల్‌గాంధి... మరో 3నెలలు బిజీ బిజీ!
posted on: Feb 16, 2016 11:15AM

రాహుల్ గాంధి ఇప్పుడు మరో సమస్యని తలకెత్తుకున్నారు. అటవీ భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడేందుకు ఆయన గిరిజనులని సంఘటితం చేయాలనుకుంటున్నారు. అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అటవీ చట్టాలను దుర్వినియోగం చేస్తోందనీ, తనకి తోచిన వారికి అటవీ భూములను కట్టబెడుతోందన్నది రాహుల్ గాంధి ఆరోపణ. ఇదే విషయాన్ని మరింత రాజకీయం చేసి, కాంగ్రెస్‌కు దూరమైన ఓటుబ్యాంకును తిరగి దక్కించుకోవాలన్నది ఆయన వ్యూహంగా తెలుస్తోంది. ఈమేరకు ఆయన తన సహచరులందరికీ తగిన సూచనలందించారట! ఇందుకోసం రాహుల్ గారు స్వయంగా ఆంధ్రప్రదేశ్, ఒడిషా, మధ్యప్రదేశ్ వంటి ఆరు రాష్ట్రాలలో పర్యటించనున్నట్లు సమాచారం.
మూడు నెలల పాటు ఆయన ఆయా రాష్ట్రాలలో పర్యటిస్తూ, పాదయాత్రలు చేస్తూ, ఉపన్యాసాలు దంచేస్తూ బిజీ బిజీగా గడపనున్నట్లు సమాచారం. దేశంలో సమస్య ఎక్కడ ఉంటే అక్కడ వాలిపోతున్న రాహుల్ ఈ సమస్య కోసమైన తుదివరకూ పోరాడతారా లేకపోతే మరో సమస్య రాగానే అక్కడికి ఎగిరిపోతారా అన్నది వేచి చూడాల్సిందే! ఇందులో గమనించాల్సిన విషయం ఏమిటంటే... రాహుల్ పర్యటించనున్న ఆరు రాష్ట్రాలలోనూ కాంగ్రెస్‌కు ప్రత్యర్థి పార్టీల ప్రభుత్వాలే నడుస్తున్నాయి. అడవులు విపరీతంగా ఉన్న హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాల జోలికి ఆయన పోనే పోవడం లేదు. మరి రాహుల్ గాంధి అటవీభూముల గురించి ఆందోళనతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లా లేక స్థానికంగా ఉన్న ప్రభుత్వాల మీద ఆందోళన రగిల్చేందుకు బయల్దేరుతున్నట్లా!



.jpg)


