పాపం రాహుల్ కోరికలు తీరతాయా?

 

పాపం రాహుల్ గాంధీ కోరికలు గొంతెమ్మ కోరికల్లా తీరుతాయో లేదో అన్న సందేహం మొదలవుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు తన పుత్ర రత్నాన్ని పీఎం చేద్దామని ఎంతో ప్రయత్నించింది. అంతేకాదు రాహుల్ గాంధీ కూడా చాలా ఎదురుచూశాడు. కానీ అతని ఆశ మాత్రం తీరలేదు. పాపం అతనికోసం సోనియమ్మ ఏకంగా ఒకటిగా ఉన్న రాష్ట్రాన్ని కూడా విడదీసింది. కానీ ఫలితం శూన్యం. అది పోతే పోయింది ఇప్పుడు కనీసం కాంగ్రెస్ అధ్యక్ష పదవి అయినా దక్కుతుందేమో అని ఆశగా ఎదురుచూసిన రాహుల్ కు నిరాశే ఎదురైంది.

అసలు ఈ యేడాది డిసెంబర్‌ నాటికి సోనియా గాంధీ అధ్యక్ష పదవీకాలం ముగియనుంది. అయితే ఢిల్లీలో ప్రస్తుతం జరుగుతున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో దీనిపై చర్చించి సోనియా పదవీకాలాన్నే మరో ఏడాది పాటు పొడిగించాలని వర్కింగ్‌ కమిటీ నిర్ణయం తీసుకుంది. దీంతో రాహుల్ గాంధీ అధ్యక్షు పదవి చేపట్టడానికి మరో ఏడాది పట్టనుంది. 

ఇప్పుడు అసలే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అంతంత మాత్రన ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు రాహులు గాంధీ చేతిలో పెడితే అసలుకే ఎసరోస్తుందని ఆలోచించే నేతలు ఈ నిర్ణయం తీసుకున్నట్టు రాజకీయ వర్గాలు అనుకుంటున్నాయి. ఎందుకంటే మొన్నటి ఎన్నికల్లో రాహుల్ గారి సామర్థ్యం చూసి అప్పుడే విమర్శలు వచ్చాయి. అందులోనూ ఈ ఏడాది కొన్ని రాష్ట్రాల్లో.. 2017లో మరికొన్ని రాష్ట్రాల్లో ఎన్నికల్లు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు పార్టీ బరువు బాధ్యతలు రాహుల్ పై పెడితే మొదటికే మోసం వస్తుందని తలచి వచ్చే ఏడాది రాహుల్ కు అధ్యక్ష పదవి కట్టబెట్టాలని పార్టీ నేతలు భావిస్తున్నారు. దీంతో ఈ ఏడాది కూడా సోనియానే పార్టీ బాధ్యతలు చేపట్టనున్నారు. మరి వచ్చే ఏడాది అయినా రాహుల్ గాంధీ కోరిక తీరుతుందో? లేదో?అప్పుడు కూడా మరో ఏడాది అంటూ పొడిగిస్తారో చూడాలంటే ఏడాది ఆగాల్సిందే.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu