రాహుల్ గాంధీ అందుకే తెలంగాణాను ఎంచుకొన్నారా?

 

రాహుల్ గాంధీ ఈరోజు తెలంగాణాలో పాదయాత్ర చేసారు. కానీ ఆయన తెలంగాణాలో బదులు ఆంధ్రాలో పర్యటించి ఉండి ఉంటే పార్టీకి ఎక్కువ ప్రయోజనం చేకూరేది. ఏవిధంగా అంటే ప్రస్తుతం ఆంధ్రాతో పోలిస్తే తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ బలంగానే ఉంది. పైగా కొంతమంది శాసనసభ్యులు, యం.యల్సీ.లుగా ఎన్నికయ్యి చట్టసభలలో పార్టీకి ప్రాతినిధ్యం కూడా వహిస్తున్నారు.

 

కానీ రాష్ట్ర విభజన కారణంగా ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకు పోయింది. ఒక్కరంటే ఒకరు కూడా కాంగ్రెస్ తరపున ఎన్నిక కాలేదు. దానితో వారి ఆత్మవిశ్వాసం కూడా బాగా దెబ్బతిని ఉంది. అటువంటప్పుడు రాహుల్ గాంధీ ఆంధ్రాలో బలహీనంగా ఉన్న కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి అక్కడి కార్యకర్తలు, నేతలలో మళ్ళీ మనోధైర్యం పెంచేందుకు ఆంధ్రాలో పర్యటించి ఉండి ఉంటే పార్టీకి ఎంతో కొంత మేలు జరిగేది. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు రాష్ట్ర విభజన చేసినందుకు కాంగ్రెస్ పార్టీపై నేటికీ చాలా ఆగ్రహంతో ఉన్నందునే బహుశః ఆయన ఆంధ్రాలో అడుగుపెట్టడానికి భయపడి తెలంగాణాతో సరిపెట్టుకొన్నారేమో? అని రాజకీయవర్గాలలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu