హర్యానాలో 5 లక్షల నకిలీ ఓట్లు : రాహుల్ గాంధీ
posted on Nov 5, 2025 2:56PM
.webp)
హర్యానా ఎన్నికల్లో ఓటు చోరీ జరిగిందని లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీతో సీఈసీ చేతులు కలిపి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని రాహుల్ విమర్శించారు. హరియాణలో ప్రతి 8 ఓట్లలో ఒకటి ఫేక్ ఓటు ఉందని ఆరోపించారు. డూప్లికేట్ ఓట్లను గుర్తించేందుకు ఈసీ వద్ద సాప్ట్‌వేర్ ఉంది. అయినా 5 లక్షల నకిలీ ఓట్లు ఎలా వచ్చాయిని రాహుల్ ప్రశ్నించారు.
బ్రెజిల్‌కు చెందిన ఓ మోడల్‌కు కూడా 22 ఓట్లు ఉన్నాయని తెలిపారు. ఆమె ఫోటో ఒకటే అయినప్పటికీ సీమా, స్వీటీ, సరస్వతి వంటి వివిధ పేర్ల, వయస్సులు, జెండర్లతో 22 ఓట్లను సృష్టించారు. హర్యానా ఎన్నికల్లో అన్ని ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ విజయాన్ని సూచించినప్పటికి ఫలితాలు భిన్నంగా వచ్చాయన్నారు. హెచ్ ఫైల్స్ అనే పదం గురించి ప్రస్తావించారు.ఓటు హక్కు నమోదుకు హౌస్ నెంబర్ తప్పనిసరి కావడంతో ఇళ్లు లేని నిరుపేదలకు ఇబ్బంది కలుగుతోందని ఈసీ ఓ కొత్త రూల్ తీసుకొచ్చిందని రాహుల్ గుర్తు చేశారు.
ఇల్లు లేని నిరుపేదలు ఓటు హక్కు నమోదు సమయంలో ఇంటి నెంబర్ ను ‘జీరో’ గా పేర్కొనే వెసులుబాటు కల్పించిందని చెప్పారు. అయితే, ఈ విధానం వెనక నిరుపేదలకు ఓటు హక్కు కల్పించాలనే సదుద్దేశం కన్నా అక్రమ ఓటర్లు, ఫేక్ ఓటర్లకు జాబితాలో చోటు కల్పించాలనే దురుద్దేశమే ఉందని రాహుల్ విమర్శించారు .ఎన్నికల జాబితాలో ఇంటి నెంబర్ జీరోగా పేర్కొన్న పలు ఓటర్ల ఇళ్లను తన టీమ్ ప్రత్యక్షంగా వెళ్లి పరిశీలించిందని ఆయన తెలిపారు.
క్షేత్రస్థాయిలో జరిపిన ఈ పరిశీలనలో సంచలన విషయాలు బయటపడ్డాయని రాహుల్ చెప్పారు.హర్యానా చరిత్రలో తొలిసారిగా, పోస్టల్ బ్యాలెట్లు వాస్తవ ఓట్లతో సరిపోలలేదని, ఇది ఇంతకు ముందు ఎప్పుడూ జరగలేదని, కాంగ్రెస్ అఖండ విజయాన్ని ఓటమిగా మార్చడానికి ఒక ప్రణాళికను అమలు చేశారని రాహుల్ ఆరోపించారు. అయితే ఎన్నికల కమిషన్ వర్గాలు రాహుల్ గాంధీ వాదనలను తోసిపుచ్చాయి.