Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...బిన్నీ, ద్రవిడ్, మిథాలీలకు ‘లైఫ్ టైం అచీవ్‌మెంట్’ అవార్డులు
posted on: Mar 14, 2026 6:10PM

భారత క్రికెట్‌లో విశిష్ట సేవలు అందించిన ముగ్గురు దిగ్గజాలను సీకే నాయుడు లైఫ్ టైం అచీవ్‌మెంట్ అవార్డుతో బీసీసీఐ సత్కరించనుంది. బీసీసీఐ మాజీ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, టీమిండియా మాజీ కెప్టెన్, కోచ్ రాహుల్ ద్రవిడ్, మహిళా క్రికెట్ మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్‌లు ఈ పురస్కారానికి ఎంపికయ్యారు. వీరిని ఆదివారం (15-3-26న) ఢిల్లీలో జరిగే నమన్ అవార్డ్స్ 2026 కార్యక్రమంలో సన్మానించనున్నారు.
ఐసీసీ ట్రోఫీలు గెలిచిన ఐదు భారత జట్లను కూడా నమన్ అవార్డ్స్‌లో ప్రత్యేకంగా గౌరవించనున్నారు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ (2025) సాధించిన భారత పురుషుల జట్టు, 2026 టీ20 ప్రపంచ కప్ గెలిచిన భారత పురుషుల జట్టు, 2025 మహిళల వన్డే ప్రపంచ కప్ 2025 సాధించిన భారత మహిళా జట్టు, పురుషు జట్టు: అండర్ 19 ప్రపంచ కప్ 2025 గెలుచుకున్న పురుషుల జట్టు, అండర్ 19 మహిళల జట్లను ఈ సందర్భంగా పురస్కరించనున్నారు.
వీరితో పాటు 2024-25 సీజన్‌కు గాను ప్రస్తుత ఆటగాళ్లకు కూడా అవార్డులు ప్రకటించారు. టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ రెండోసారి 'పాలి ఉమ్రిగర్ అవార్డు' (ఉత్తమ అంతర్జాతీయ క్రికెటర్ - పురుషులు) అందుకోనుండగా, స్మృతి మంధానా ఐదోసారి ఉత్తమ అంతర్జాతీయ మహిళా క్రికెటర్‌గా నిలిచారు.



.webp)


