డెడ్ ఎకాన‌మీలోనూ ఆటోసేల్స్ అదుర్స్.. వింటున్నారా రాహుల్ జీ

posted on: Jun 2, 2026 2:39PM

రాహుల్ గాంధీ ఆయ‌న మ‌నుషులు.. భారత ఆర్థిక వ్యవస్థను డెడ్ ఎకానమీగా వెక్కిరిస్తూ ఉంటే..  ఇప్పుడు  సొసౌటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (ఎస్ఐఏమ్) డేటా ఈ వాదనలను తారుమారు చేసింది.  2025-26 ఆర్థిక సంవత్సరంలో భారత ఆటోమొబైల్ రంగం రికార్డు స్థాయి వృద్ధి నమోదు చేసింది.    ఎస్ఐఏమ్ విడుదల చేసిన తాజా డేటా ప్రకారం..  అన్ని సెగ్మెంట్లను కలుపుకుని దేశవ్యాప్తంగా  సుమారు- 2.83 కోట్ల వాహనాలు అమ్ముడయ్యాయి. అంటే, దేశీయ మార్కెట్లో సగటున  ప్రతి నిమిషానికీ  54 వాహనాల విక్ర‌యాలు జ‌రిగాయి. ఇది భారతీయుల కొనుగోలు శక్తికి, ఆర్థిక వ్యవస్థ బలానికి ప్రతిబింబం.

సెగ్మెంట్ల వారీగా అమ్మకాల వివరాలు చూస్తే.. టూవీల‌ర్ మొత్తం అమ్మకాలు.. 2.17 కోట్లు కాగా.. కార్ల   సేల్స్  46.43 లక్షల యూనిట్లుగా ఉంది. ఇక ఈ అమ్మ‌కాల్లో 5.64 ల‌క్ష‌ల  కార్ల అమ్మ‌కాల‌తో మ‌హారాష్ట్ర టాప్ గేర్ వేయ‌గా.. త్రీవీల‌ర్స్ మొత్తం అమ్మ‌కాలు 8.36 యూనిట్లు. క‌మ‌ర్షియ‌ల్ వెహిక‌ల్స్ సేల్స్ 10.80 ల‌క్ష‌ల  యూనిట్లు. ఈ ఆటో సేల్స్ లో మ‌హారాష్ట్ర 1.61 ల‌క్ష‌ల‌ అమ్మ‌కాల‌తో హై పొజిష‌న్లో ఉండ‌గా.. ఆ త‌ర్వాతి స్థానాలలో.. గుజ‌రాత్, త‌మిళ‌నాడు, ఉత్త‌ర ప్ర‌దేశ్, క‌ర్ణాట‌క ఉన్న‌ట్టు చెబుతున్నాయి గ‌ణాంకాలు. ఇందులో మ‌రింత ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన  విష‌య‌మేంటంటే.. గ్రామీణ  ప్రాంతాల్లోనే ఈ అమ్మ‌కాలు ఎక్కువ జ‌రిగిన‌ట్టు  ఎస్ఐఏమ్ పేర్కొంది.  టూవీల‌ర్స్,  మ‌రీ ముఖ్యంగా 100సీసీ నుంచి 125సీసీ మోటార్ సైకిళ్ల అమ్మకాల్లో.. గ్రామీణ ప్రాంతాల వాటా చాలా ఎక్కువగా  పెరిగింది. అలాగే కార్ల అమ్మకాల సంఖ్య కూడా పట్టణాల్లో కంటే గ్రామీణ ప్రాంతాల్లో బాగా పెరిగింది. 

గ్రామీణ ప్రాంతాల్లో డిమాండ్ పెరగడం.. ఇది ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుదలకు సూచిక అంటున్నారు మార్కెట్ పండితులు. ఈ వృద్ధికి ప్రధాన కారణాలు ఏమిటో ఎన‌లైజ్ చేస్తే.. ఎస్ఐఏమ్ డేటా ప్రకారం,, ఈ రికార్డు వృద్ధికి  గ్రామీణ  ప్రాంతాల్లో పెరిగిన  డిమాండ్, పండ‌గ సీజ‌న్ల ఆఫ‌ర్లు, ఆపై దేశంలో మెరుగుప‌డ్డ ఆర్ధిక స్థితిగ‌తులు, త‌ద్వారా పెరిగిన ప్ర‌జ‌ల  కొనుగోలు శ‌క్తి. వేగంగా జ‌రుగుతోన్న ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి పనులు ప్ర‌ధాన  కార‌ణాలుగా చెబుతున్నారు.

ఈ ట్రెండ్ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయనడానికి  సూచిక అనడంలో సందేహం లేదంటారు మార్కెట్ ఎన‌లిస్టులు. రోడ్లు, కనెక్టివిటీ, మౌలిక సదుపాయాల అభివృద్ధి,  ఆర్థికాభివృద్ధి..  పెరగడంతో గ్రామీణ భారతం కూడా వాహనాల కొనుగోలులో ముందంజలో ఉంది. రాహుల్ అండ్ కో డెడ్ ఎకానమీ వంటి నినాదాలు త‌ర‌చూ ఇస్తూనే ఉండొచ్చు. కానీ.. ప్రతి నిమిషానికి 54 వాహనాలు అమ్ముడవుతున్న గణాంకాలు మాత్రం ఈ వెక్కిరింపులకు దీటైన జ‌వాబులే ఇస్తున్నాయంటారు ప‌లువురు ఆర్ధిక నిపుణులు.

-సీతారాం కంఠంనేని

ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి https://www.teluguone.com పోర్టల్ ను  ఫాలో అవ్వండి. లైక్ చేయండి. షేర్ చేయండి. మీ విలువైన అభిప్రయాలను తెలియజేయండి.     

google-ad-img
    Related Sigment News
    • Loading...