Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...రఘువీరారెడ్డి ఎందుకు సిగ్గుపడాలంటే....
posted on: Feb 19, 2015 10:34AM

తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ తగుదునమ్మా అంటూ పోటీ చేసింది. అక్కడ ఎలాంటి ఫలితం రావాలో అలాంటి ఫలితమే వచ్చింది. కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ కూడా దక్కనంత ఓటమిని మరోసారి చవిచూసింది. ఓటర్లు చెప్పిన తీర్పుని గౌరవిస్తూ తల వంచుకుని నిలబడితే కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ నాయకులకు మర్యాదగా వుండేది. అయితే తమ
సహజమైన శైలిలోనే తమ ఓటమికి, టీడీపీ గెలుపుకు వక్రభాష్యాలు చెబుతున్నారు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఎలాంటిదంటే... ఒక్క మాటలో చెప్పాలంటే ఒక శవం లాంటిది. ఆ శవానికి ప్రాణం తీసుకురాలేమని తెలిసినా ఏదో చికిత్స చేస్తున్నట్టు నటించే డాక్టర్ గారు ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి. సదరు శవానికి తాను చేస్తున్న ట్రీట్‌మెంట్ నటనను రక్తికట్టించే ప్రయత్నాల్లో భాగంగా అప్పుడప్పుడు అధికార తెలుగుదేశం పార్టీ మీద విరుచుకుపడుతూ వుంటారు. పసలేని ఆరోపణలు చేస్తూ వుంటారు. తాజాగా తిరుపతిలో ఘోరంగా ఓడిపోయిన తర్వాత రఘువీరారెడ్డి ఒక గొప్ప కామెంట్ చేశారు. తిరుపతిలో ఎన్నిక జరిగిన తీరు చూసి తాను సిగ్గుపడుతున్నాడట. అయితే రఘువీరా గారు సిగ్గుపడాల్సింది తిరుపతి ఎన్నిక విషయంలో కాదు... ఆయన సిగ్గుపడాల్సిన విషయాలు వేరే వున్నాయి. వాటిలో కొన్నిటిని చూద్దాం.
1. కాంగ్రెస్ పార్టీ పదేళ్ళపాటు దేశాన్ని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అత్యంత దారుణంగా పరిపాలించినందుకు...
2. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించినందుకు...
3. ఆంధ్రప్రదేశ్‌ని ఏకపక్షంగా విభజిస్తుంటే రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు చేతులు ముడుచుకుని కూర్చున్నందుకు...
4. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇక కాంగ్రెస్ పార్టీకి స్థానం లేదని తెలిసినా ఇంకా ఏదో బావుకుందామని తాపత్రయపడుతున్నందుకు...
5. మీ పార్టీకి ఇంకా ఉనికి ఉందని భ్రమపడుతూ తెలుగుదేశం పార్టీ మీద లేనిపోని ఆరోపణలు చేస్తున్నందుకు....
6. ఓడిపోతామని తెలిసినా తిరుపతి ఉప ఎన్నికలో పోటీ చేసినందుకు....
7. మీ పార్టీ చేసిన అడ్డగోలు విభజన కారణంగా నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థికంగా ఎన్నో సమస్యలు ఎదుర్కొనాల్సి వచ్చినందుకు...
8. ఇంత జరిగినా ఏపీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంతమాత్రం సిగ్గుపడనందుకు...
9. ఇలాంటి కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్‌లో నాయకత్వం వహించే దుర్గతి పట్టినందుకు....
.... ఇలా ఇన్ని కారణాలతో సిగ్గుపడాల్సిన అవసరం రఘువీరారెడ్డి గారికి వుంది.. మరి ఇప్పటికైనా సిగ్గుపడతారా...? సిగ్గుపడాల్సిన చోట సిగ్గు పడకపోవడం సిగ్గు సిగ్గు...


.jpg)



