మీ బిల్డప్పులు మండ!
posted on: Apr 1, 2014 4:57PM
.jpg)
సీమాంధ్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, సీమాంధ్రకు సీఎం అయిపోవాలని కలలు కంటున్న ఆనం సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మీద ఇస్తున్న బిల్డప్పుడు చూస్తుంటే మెడకాయ మీద తలకాయ ఉన్న ఎవరికైనా చిరాకు పుట్టడం ఖాయమని రాజకీయ పరిశీకులు అంటున్నారు. సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ యాసిడ్ పోసి క్లీన్ చేసినట్టు క్లీన్ అయిపోయింది. ఇంకో నాలుగైదు ఎన్నికల వరకు కాంగ్రెస్ పార్టీ కోలుకునే ఛాన్స్ లేదని సీమాంధ్రలో ఎవర్నడిగినా చెబుతారు. పాపం ఆ విషయం రఘువీరారెడ్డికి, ఆనం రామనారాయణరెడ్డికి తెలియదంటారా? తెలిసిన విషయాన్ని తెలియనట్టు, తెలియని విషయాన్ని తెలిసినట్టు నటించడమే రాజకీయ నాయకుల ప్రాథమిక లక్షణం కాబట్టి వీళ్ళిద్దరూ అలాగే యాక్ట్ చేస్తున్నారు.
వాళ్ళ మాటలు విని జనం నవ్వుకుంటున్నారని తెలిసినా వాళ్ళిద్దరు చాలా వెరైటీగా మాట్లాడుతూ బిల్డప్పులు ఇచ్చుకుంటున్నారు. వీళ్ళిద్దరూ చెప్పిన దాని ప్రకారం సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ చాలా స్ట్రాంగ్‌గా వుందట. పార్టీ నుంచి నాయకులందరూ వెళ్ళిపోయినా కార్యకర్తలు మాత్రం బోలెడంతమంది పార్టీలోనే వున్నారట. సీమాంధ్ర నుంచి పోటీ చేయడానికి వేలల్లో దరఖాస్తులు వస్తున్నాయట. అసెంబ్లీకి పోటీ చేస్తామని ఉవ్విళ్ళూరుతూ 1160 మంది దరఖాస్తు చేశారట. అలాగే పార్లమెంట్‌కి పోటీ చేస్తామంటూ 175 మంది దరఖాస్తు చేసుకున్నారట.
వీళ్ళల్లో ఎవరికి టిక్కెట్ ఇవ్వాలో తమకి అర్థం కాకపోవడంతో ఈ దరఖాస్తులన్నీ తీసుకుని ఢిల్లీ వెళ్ళి అక్కడ అభ్యర్థులను ఖరారు చేస్తారట. అన్ని దరఖాస్తులు వచ్చాయి, ఇన్ని దరఖాస్తులు వచ్చాయి అని అనడం తప్ప దరఖాస్తు చేసినవాళ్లెవరో చెప్పే ధైర్యం మాత్రం వీళ్ళిద్దరికీ లేకుండా పోయింది. సీమాంధ్రలో నిండా మునిగిపోయిన కాంగ్రెస్ పార్టీని భుజాల మీదకి ఎత్తుకుని లేనిపోని బిల్డప్పులు ఇస్తున్న వీళ్ళిద్దరి మీద జాలి పడటం ప్రతి సీమాంధ్రుడి కర్తవ్యం.




.jpg)
.webp)

.webp)


