రేబిస్ వ్యాధి సోకి బాలిక మృతి
posted on Oct 26, 2025 12:20PM

వీధి కుక్క కరవడంతో రేబిస్ వ్యాధి సోకి 10 ఏళ్ల బాలిక మృతి చెందింది. నిజామాబాద్ జిల్లా బాల్కొండకు చెందిన లక్షణ అనే బాలికను నెల రోజుల క్రితం కరిచిన వీధి కుక్క కరిచింది. ఈ విషయాన్ని బాలిక ఇంట్లో చెప్పలేదు. మూడు రోజుల క్రితం ఆమె వింతగా ప్రవర్తించడంతో ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. రేబిస్ సోకినట్లు నిర్ధారణ అయింది. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ లక్షణ మృతి చెందింది.
మున్సిపాలిటిలో వీధి కుక్కల నిర్మూలనకు అధికారుల చర్యలు నామమాత్రంగా ఉన్నాయి. నిత్యం ప్రజల నుంచి అనేక ఫిర్యాదులు అందిన మున్సిపల్ అధికారులు మాత్రం వీధి కుక్కల బెడద నుంచి ప్రజలను కాపాడలేకపోతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఎప్పుడో ఒక్కసారి వీధి కుక్కలను పట్టుకోని పోయి అనంతరం చేతులు దులుపుకోవడం మున్సిపల్ అధికారుల వంతుగా మారిందనే విమర్శలు ఉన్నాయి. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు వీధి కుక్కల స్వైర విహారంపై స్పందించి నివారణకు చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరతున్నారు.