Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...రాణి చీమలకు విదేశాల్లో భారీ డిమాండ్
posted on: Mar 14, 2026 9:22PM

శాస్త్రీయంగా మెస్సార్ సెఫలోట్స్ గా పిలిచే రాణి చీమలకు యూరప్, ఆసియా దేశాల్లో భారీగా డిమాండ్ పెరుగుతోంది. వీటిని అక్కడ చాలామంది పెంపుడు జంతువుల్లా పెంచుకోవడం ట్రెండ్‌గా మారింది. ఈ విషయాన్ని గత ఏడాది కెన్యా వైల్డ్ లైఫ్ సర్వీస్ హెచ్చరించింది.
చీమలను అక్రమంగా తరలించే ప్రయత్నంలో ఝాంగ్ అనే వ్యక్తి వాటిని ప్రత్యేకంగా టెస్ట్ ట్యూబ్‌లలో పెట్టి తీసుకెళ్తున్నట్లు అధికారులు గుర్తించారు. మరికొన్ని చీమలను టిష్యూ పేపర్ రోల్స్‌లో దాచిపెట్టి తన బ్యాగులో పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ప్రాసిక్యూటర్ అలెన్ ములామా కోర్టుకు తెలిపిన వివరాల ప్రకారం, ఝాంగ్ బ్యాగులో మొత్తం 1,948 చీమలు ప్రత్యేక ట్యూబ్‌లలో సజీవంగా ఉన్నట్లు గుర్తించారు. అదనంగా మరో 300 చీమలు మూడు టిష్యూ పేపర్ రోల్స్‌లో దాచిపెట్టినట్లు అధికారులు వెల్లడించారు.
ఈ కేసులో మరింత ఆధారాలు సేకరించేందుకు నిందితుడి ఫోన్, ల్యాప్‌టాప్‌లను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపేందుకు అనుమతి ఇవ్వాలని ప్రాసిక్యూషన్ కోర్టును కోరింది.కేసుపై లోతైన దర్యాప్తు కొనసాగుతోందని కెన్యా వైల్డ్ లైఫ్ సర్వీస్‌కు చెందిన సీనియర్ అధికారి డంకన్ జుమా తెలిపారు. కెన్యాలోని మరికొన్ని పట్టణాల్లో కూడా చీమలను సేకరిస్తున్న గ్యాంగ్ ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. దీంతో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందన్నారు.
ఇక గత ఏడాది మేలో వేల సంఖ్యలో రాణి చీమలను అక్రమంగా దేశం బయటకు తరలించే ప్రయత్నం చేసిన కేసులో నలుగురికి ఒక సంవత్సరం జైలు శిక్ష లేదా 7,700 డాలర్ల జరిమానా విధించింది కెన్యా కోర్టు. కెన్యాలో ఇలాంటి కేసులో ఇది మొదటి తీర్పు. ఆ నలుగురిలో ఇద్దరు బెల్జియం దేశస్తులు, ఒకరు వియత్నాం వ్యక్తి కాగా మరొకరు కెన్యాకు చెందినవారు. తమపై వచ్చిన ఆరోపణలను వారు కోర్టులో అంగీకరించారు. ఇది నిఘా వర్గాల సమన్వయంతో చేసిన ప్రత్యేక ఆపరేషన్ అని కేడబ్ల్యూఎస్ వెల్లడించింది.
అయితే ఈ అరుదైన చీమలను తమ హాబీ కోసం మాత్రమే సేకరించామని, ఇది చట్టవిరుద్ధమని తమకు తెలియదని బెల్జియం వ్యక్తులు కోర్టులో తెలిపారు. నిపుణుల ప్రకారం, ఈ రకమైన చీమలు ప్రకృతి సమతౌల్యాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇవి లేకపోతే జీవవైవిధ్యం దెబ్బతినే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
దర్యాప్తు అధికారుల ప్రకారం, ఈ అక్రమ రవాణా గ్యాంగ్‌కు ప్రధాన నిర్వాహకుడు ఝాంగ్ అని అనుమానిస్తున్నారు. గత ఏడాది మరో పాస్‌పోర్ట్ ఉపయోగించి ఆయన కెన్యా నుంచి తప్పించుకున్నట్టు సమాచారం.ఇటీవల ఝాంగ్‌ను ఐదు రోజుల కస్టడీలోకి తీసుకునేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. కేసుపై దర్యాప్తు మరింత లోతుగా సాగుతోంది. సింహాలు, ఏనుగుల వంటి పెద్ద జంతువుల సంరక్షణకు పేరుగాంచిన కెన్యా వైల్డ్ లైఫ్ సర్వీస్, గత ఏడాది ఈ కేసులో వచ్చిన తీర్పును చరిత్రాత్మక నిర్ణయం గా అభివర్ణించింది.






