Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...14న వరల్డ్ క్వాంటం డే.. ఏపీలో క్వాంటం టెస్ట్ బెడ్లకు ప్రారంభోత్సవం
posted on: Apr 13, 2026 8:16AM

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబా బునాయుడుఎప్పుడూ ముందుంటారు. క్వాంటం మంగళవాకం (ఏప్రిల్ 14) ప్రపంచ క్వాంటం దినోత్సవం సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అమరావతిలో రెండు అత్యాధునిక క్వాంటం టెస్ట్ బెడ్లను ప్రారంభించనున్నారు. తద్వారా దేశంలోనే క్వాంటం టెస్ట్ రిఫరెన్స్ ఫెసిలిటీని ఏర్పాటు చేసిన తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ చిరిత్ర సృష్టించనుంది.
ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులో భాగంగా గన్నవరంలోని మేధా టవర్స్, రాజధాని ప్రాంతంలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీ క్యాంపస్‌లలో రెండు ప్రత్యేక కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 1ఎస్ మరియు , 1క్యూ పేర్లతో వీటిని చంద్రబాబు జాతికి అంకితం చేయనున్నారు. ఈ కేంద్రాల ద్వారా క్వాంటం కంప్యూటర్ హార్డ్‌వేర్‌ను క్షుణ్ణంగా పరీక్షించి, ధృవీకరిస్తారు. ఇది అమరావతిని అంతర్జాతీయ స్థాయిలో క్వాంటం వ్యాలీ గా మారుస్తుంది.
ఈ మినీ క్వాంటం కంప్యూటర్ టెస్ట్ బెడ్లు మైనస్ 273 డిగ్రీల సెంటీగ్రేడ్ వంటి అత్యంత శీతల ఉష్ణోగ్రతల వద్ద పనిచేస్తాయి. మేధా టవర్స్‌లో క్యూబిటెక్ సంస్థ భాగస్వామ్యంతో ఒక కేంద్రం ఏర్పాటు కాగా, ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో సూపర్ కండక్టింగ్ టెక్నాలజీతో మరొకటి సిద్ధమైంది. ఎస్ఆర్ఎంలో ఏర్పాటు చేసిన కేంద్రాన్ని ఓపెన్ యాక్సెస్ పద్ధతిలో ఉంచడం వల్ల పరిశోధకులు, స్టార్టప్‌లకే కాకుండా విద్యార్థులకు కూడా ఈ టెక్నాలజీ సులభంగా అందుబాటులోకి వస్తుంది.
ఈ ప్రాజెక్టులో మరో విశేషం కూడా ఉంది. ఇందులో వినియోగించిన ఉపకరణాలన్నీ పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారైనవే. దేశంలోని ప్రముఖ సంస్థలైన టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ (టీఐఎఫ్ఆర్), ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సి), డీఆర్డీవో (డీఆర్డీవో) వంటి అగ్రశ్రేణి సంస్థల సహకారంతో ఇది రూపుదిద్దుకుంది. జాతీయ క్వాంటం మిషన్ లక్ష్యాలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ ఈ అడుగులు వేస్తున్నది.
కాగా ఈ క్వాంటం వ్యాలీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి దేశంలోని ప్రముఖ శాస్త్రవేత్తలు, ఐఐటీ ప్రొఫెసర్లు, క్వాంటం రంగ నిపుణులు హాజరౌతున్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 1.5 లక్షల మంది విద్యార్థులు ఈ కార్యక్రమాన్ని వర్చువల్ విధానంలో వీక్షించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.


.webp)
.webp)


