Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...క్యూ నెట్ మోసాలు మళ్లీ షురూ!?
posted on: Mar 23, 2026 2:35PM

గత కొంతకాలంగా తెరమరుగైన మల్టీ లెవెల్ మార్కెటింగ్ సంస్థ క్యూ నెట్ మళ్లీ చురుకుగా కార్యకలాపాలు సాగిస్తున్నది. దీంతో క్యూనెట్ మోసాలు మళ్లీ షురూ చేసిందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. ప్రస్తుతం క్యూనెల్ మోసాలపై మళ్లీ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
తాజాగా నమోదైన కేసులతో ఈ వ్యవహారం మళ్లీ వెలుగులోకి వచ్చింది. దీంతో క్యూనెట్ వ్యవహారాన్ని సీరియనస్ గా పరిగణనలోనికి తీసుకున్న హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) పోలీసులు రంగంలోకి దిగి ఆ సంస్థ కార్యాలయాలపై దాడులు నిర్వహించారు.
హైదరాబాద్‌ను కేంద్రంగా చేసుకుని సీసీఎస్ పోలీ సులు సమన్వయంతో మూడు రాష్ట్రాల్లో ఏకకాలం లో భారీ ఆపరేషన్ చేపట్టారు. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లోని కీలక నగరాలను లక్ష్యంగా చేసుకుని మొత్తం 25 ప్రాంతాల్లో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు, విశాఖపట్నం నగరాల్లో క్యూ నెట్‌కు అనుబంధంగా నడుస్తున్న కార్యాలయాలు, ట్రైనింగ్ సెంటర్లు, నివాస గృహాలపై పోలీసులు తనిఖీలు చేపట్టారు. సోమవారం (మార్చి 23) తెల్లవారుజాము నుంచే హైదరాబాద్‌లో ఆరు ప్రాంతాల్లో ఏకకాలంలో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో కీలక పత్రాలు, డిజిటల్ డేటా, ఆర్థిక లావాదేవీ లకు సంబంధించిన ఆధారాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. మల్టీ లెవెల్ మార్కెటింగ్ పేరుతో భారీ మొత్తాల్లో డబ్బులు వసూలు చేసి, కొత్త సభ్యు లను చేర్చుకునే వారికి ఇన్ సెంటివ్ లంటూ పెద్ద ఎత్తున పాల్పడుతు న్నట్లు ప్రాథమిక దర్యాప్తులో బయటపడిందని పోలీసు వర్గాల సమాచారం.
ఇప్పటివరకు సుమారు 20 మంది నిందితులను గుర్తించినట్లు తెలిసింది. వీరిలో కొందరు కీలక నిర్వాహకులుగా వ్యవహరిస్తున్నారని పోలీసులు అనుమానిస్తు న్నారు. మరికొందరిపై నిఘా ఉంచి, వారి కదలికలను గమనిస్తున్నారని తెలుస్తోంది. త్వరలోనే మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.
ఇటీవల క్యూ నెట్ మోసాలకు సంబంధించిన రెండు కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో పోలీసులు ఈ సోదాలు నిర్వహించారు. ఇప్పటికే హైదరాబాద్ సీసీఎస్‌లో క్యూనెట్ పై ఆరు కేసులు నమోదై ఉన్నాయి. ఈ సంస్థ దేశవ్యాప్తంగా వందల కోట్ల రూపాయల మోసాలకు పాల్పడిందని పోలీసులు అనుమానిస్తున్నారు. జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రజలను ఆకర్షించేందుకు విదేశీ టూర్లు, అధిక లాభాల వాగ్దానాలు, విలాసవంత మైన జీవితం ఎరగా చూపుతూ ఈ సంస్థ కార్యకలాపాలు సాగిస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడవుతోంది.






