Latest News

బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు అరుదైన రికార్డ్

posted on: Jan 22, 2026 4:49PM

భారత స్టార్ షట్లర్, రెండు ఒలింపిక్ పతకాల విజేత  పూసర్ల వెంకట సింధుచరిత్ర సృష్టించింది. పీవీ సింధు  కెరీర్ లో 500 మ్యాచుల్లోవిజయం సాధించిన తొలి భారత షట్లర్ గా రికార్డు సృష్టించింది. అలాగే ప్రపంచంలో ఈ ఘనత సాధించిన ఆరో మహిళా షట్లర్ గా నిలిచింది.

 తాజాగా ఇండోనేషియా మాస్టర్స్‌-2026 టోర్నమెంట్ ప్రీ క్వార్టర్ ఫైనల్  డెన్మార్క్‌ షట్లర్‌ ఫో లినే హోజ్‌మార్క్‌ జేర్‌ఫీల్డ్‌ను 21-19, 21-18 తేడాతో ఓడించి తన 500వ విజయాన్ని అందుకుంది.  ఇండోనేషియా మాస్టర్స్‌-2026 టోర్నీలో భాగంగా ప్రిక్వార్టర్‌ ఫైనల్లో నలభై మూడు నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో సింధు   విజయం సాధించి క్వార్టర్‌ ఫైనల్‌కు దూసుకువెళ్లింది. ప్రిక్వార్టర్‌ ఫైనల్లో సూపర్ విక్టరీ సాధించిన సింధు, క్వార్టర్‌ ఫైనల్లో   చైనాకు చెందిన వరల్డ్ నంబర్ 4 చెన్‌ యూ ఫీ రూపంలో గట్టి పోటీ ఎదుర్కోనుంది.

google-ad-img
    Related Sigment News
    • Loading...