ఈ భూమిపై నడయాడిన దైవ స్వరూపం పుట్టపర్తి సాయిబాబా.. చంద్రబాబు
posted on Nov 19, 2025 5:23PM

ఈ భూమిపై మనం చేసిన, మనకు తెలిసిన దైవ స్వరూపం సత్యసాయి బాబా అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ప్రేమ, సేవ, శాంతిలకు బాబా నిలువెత్తు నిదర్శనమన్నారు. పుట్టపర్తిలో జరుగుతున్న శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం పాల్గొని ప్రసంగించారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సత్యసాయి శత జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తోందని, ఆయన స్ఫూర్తిని, చూపిన మార్గాన్ని భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని చంద్రబాబు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరయ్యారు. ఈ సందర్భంగా బాబా సేవలను స్మరించుకుంటూ ప్రధాని రూ.100 విలువైన స్మారక నాణేన్ని, స్మారక తపాలా బిళ్లలను విడుదల చేశారు.
