Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...పులివెందుల.. ఒక పేరు కాదు.. మూడు లక్షల మంది గుండె చప్పుడు.!
posted on: Jul 18, 2026 11:07AM

దేశంలోని ప్రతి పట్టణానికీ ఒక చరిత్ర ఉంటుంది. ప్రతి నేలకీ ఒక వ్యక్తిత్వం ఉంటుంది. ప్రతి ఊరికీ తనదైన ప్రత్యేక గౌరవం ఉంటుంది. కానీ.. దురదృష్టవశాత్తూ పులివెందులకు మాత్రం ఒక విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది. దశాబ్దాలుగా సినిమాలు, రాజకీయ వేదికలు, టెలివిజన్ చర్చలు,
వార్తాపత్రికల శీర్షికలు, ఇప్పుడు సోషల్ మీడియా..ఇలా అన్నీ కలిసి పులివెందులను ఇవన్నీ కలిసి పులివెందులను ఒక మనిషిగా చూపించాయి.
ఒక కుటుంబంగా చూపించాయి. ఒక రాజకీయ గుర్తింపుగా మార్చేశాయి.
కానీ పులివెందుల ఎవరో ఒకరి ఇంటి పేరు కాదు.. పులివెందుల మూడు లక్షల మంది మనుషుల నివసించే ఊరిపేరు. ఈ నేల మీద ప్రతి ఉదయం రైతు నాగలి దున్నుతాడు. కూలీ తన స్వేదం చిందించి.. తన పిల్లల ఆకలి తీరుస్తాడు. తల్లి తన బిడ్డను పాఠశాలకు పంపుతుంది. విద్యార్థి తన కలల కోసం రాత్రిళ్లు మేల్కొని చదువుతాడు. వ్యాపారి రేపటి ఆశతో షట్టర్ ఎత్తుతాడు. వృద్ధుడు దేవాలయానికి వెళ్లి తన ఊరి మంచిని కోరుకుంటాడు. అయితే వారెవరూ వార్తల్లో కనిపించరు. వాళ్ల పేర్లు చర్చల్లో వినిపించవు. అసలు వారి ఉనికినే ఎవరూ గుర్తించరు. అయితే వాస్తవానికి వాళ్లే పులివెందుల.
పులివెందుల అంటే అధికారపు అహంకారం కాదు. పులివెందుల అంటే సామాన్యుడి ఆత్మగౌరవం. పులివెందుల అంటే భయం కాదు.
పులివెందుల అంటే బతుకు. పులివెందుల అంటే రాజకీయాలు కాదు. పులివెందుల అంటే ప్రజలు. ఈ దేశ రాజ్యాంగం చెబుతోంది.. ఈ దేశం ప్రజలది అని. ఏ నాయకుడూ ప్రజలకు యజమాని కాదని.. ప్రజలే యజమానులని. అయితే...
పులివెందుల ప్రజలను ఎందుకు ఎవరో ఒకరి సొత్తులా మాట్లాడుతున్నారు? ఎందుకు ఈ నేలను ఒక కుటుంబం పేరుతో మాత్రమే గుర్తిస్తున్నారు? మూడు లక్షల మంది మనుషుల గౌరవం అంత చౌకైపోయిందా? ఒక పట్టణం చరిత్రను ఒకే రాజకీయ కథలో బంధించడం... ఆ పట్టణానికి చేసే అతిపెద్ద అన్యాయం. ఎందుకంటే..
రాజకీయ నాయకులు వస్తారు.. వెళ్తారు. పార్టీలు మారతాయి, జెండాలు మారతాయి, జనం, నేల మాత్రం శాశ్వతం. అందుకే.. అందుకే ఈ రోజు ప్రపంచాన్ని ఒకటే అడుగుతున్నాం. పులివెందులను ఒక వ్యక్తి కళ్లతో చూడకండి. పులివెందులను ఒక కుటుంబం చరిత్రతో కొలవకండి. పులివెందులను మూడు లక్షల మంది మనుషుల హృదయంతో చూడండి.
ఎందుకంటే.. ఈ నేలపై పుట్టిన ప్రతి బిడ్డకు తన స్వంత ఆలోచన ఉంది. తన సొంత గౌరవం ఉంది. తన సొంత ఓటు ఉంది. తన సొంత భవిష్యత్తు ఉంది. స్వంత వ్యక్తిత్వం ఉంది. వాళ్లు ఎవరికీ చెందిన వారు కాదు. ఈ నేలకే చెందిన వారు. మేము ఎవరికీ వ్యతిరేకం కాదు. కానీ మా నేల గౌరవాన్ని ఎవరి పేరులోనూ.. ఏ ఒక్క కుటుంబంతోనో బంధించడానికి మాత్రం ఒప్పుకోం.
చివరిగా ఒక మాట... పులివెందులలో ఒక నాయకుడు ఉండొచ్చు... ఒక కుటుంబం ఉండొచ్చు... కానీ పులివెందుల అనేది వాళ్లు కాదు. పులివెందుల అంటే మూడు లక్షల మంది ప్రజల ఆత్మగౌరవం. మూడు లక్షల మంది ప్రజల గుండె చప్పుడు.. ఆ ఆత్మగౌరవానికి యజమానులు ప్రజలే.. ప్రజలే.. ప్రజలే.
భూమిరెడ్డి సాయి శ్రీనివాస్ రెడ్డి, పులివెందుల
Pulivendula heartbeat of three lakh people, Politics, Oneman, Onefamily


.webp)



