ఓరుగల్లు బిడ్డ.. లండన్ లో కౌన్సిలర్

posted on: May 11, 2026 1:09PM

లండన్‌ రాజకీయాల్లో తెలంగాణ యువతి సంచలనం నమోదు చేసింది. ఉన్నత చదువుల కోసం లండన్ వెళ్లిన ఓరుగల్లు బిడ్డ పూజిత, అక్కడే స్థిరపడ్డారు. లండన్ స్థానిక సంస్థల  ఎన్నికలలో  ది గ్రీన్ పార్టీ తరఫున విజయం సాధించి కౌన్సిలర్ గా విజయం సాధించారు.

జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన పూజిత..  పూజిత ఆరున్నర ఏళ్ల క్రితం ఎంఎస్ చదవేందుకు లండన్ వెళ్లారు. చదువు పూర్తయిన తరువాత అక్కడే ఉద్యోగంలో చేరి,   గత ఏడాది గతేడాది ఫిబ్రవరిలో వరంగల్ జిల్లా  ఒంటిమామిడిపల్లి గ్రామానికి చెందిన కడదూరి శ్రీనివాస్‌ను వివాహం చేసుకుని లండన్ లో స్థిరపడ్డారు.

 అనంతరం అత్తగారింటి ప్రోత్సాహంతో లండన్‌ లోకల్ బాడీ ఎన్నికల్లో ద గ్రీన్ పార్టీ తరపున గెలిచారు. పూజిత లండన్  కౌన్సిలర్‌గా గెలవడంపై  ఆమె అత్తింటి వారు, పుట్టింటి వారు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.   

google-ad-img
    Related Sigment News
    • Loading...