Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...అప్పుడే తన మార్క్ చూపెడుతున్న కిరణ్ బేడి
posted on: Jun 5, 2016 4:42PM
.jpg)
కొందరు ఎక్కడున్నా తన మార్క్ చూపెడుతూ మిగిలిన వారికి భిన్నమని నిరూపిస్తుంటారు. అలాంటి వారిలో ఒకరు కిరణ్ బేడి. భారత తొలి మహిళ ఐపీఎస్‌గా అసాంఘిక శక్తుల, రౌడీల భరతం పట్టారు కిరణ్‌బేడీ. ఉద్యోగ విరమణ తర్వాత కూడా సామాజిక సేవ చేశారు. అవినీతికి వ్యతిరేకంగా పొరాడారు. ఇప్పుడు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా తన మార్క్ చూపిస్తున్నారు.
మొన్నటికి మొన్న పుదుచ్చేరి మంత్రులు, అధికారులు ట్రాఫిక్ రూల్స్ పాటించాల్సిందేనని, రౌడీయిజం చేస్తే తాట తీస్తానని, అవినీతిపరుల అంతం చూస్తానంటూ వార్నింగ్ ఇచ్చారు. ఆక్రమణలను వారంలోగా తొలగిస్తామని చెప్పారు. ప్రజల నుంచి ఫిర్యాదుల కోసం 1031 హెల్ప్ లైన్ ఏర్పాటు చేశారు. ఆమె వ్యవహరశైలి రాజకీయంగా కలకలం రేపుతోంది.
ఇవాళ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పుదుచ్చేరిలోని పారిశుద్ధ్య కార్మికులతో కలిసి నగరంలోని పరిసరాలను పరిశుభ్రం చేశారు. కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిని పరిశుభ్రంగా ఉంచడం ద్వారా పర్యాటకులను అధిక సంఖ్యలో ఆకర్షించేందుకు వీలుంటుందన్నారు. ముఖానికి ముసుగు, చేతి గ్లవ్స్, పసుపు రంగు టోపీ ధరించిన బేడీ..లాల్ బహదూర్ శాస్త్రి వీధీ, జింజీ సలయ్ ప్రాంతాల్లో పారిశుద్ధ్య కార్మికులతో కలిసి వ్యర్థాలను తొలగించారు. కేవలం తన ప్రచారం కోసం మాత్రమే ఈ కార్యక్రమంలో పాల్గొనలేదని, అంతా కలిసి ఇలాగే శ్రమిస్తే త్వరలోనే పుదుచ్చేరి పరిశుభ్ర నగరంగా అవతరిస్తుందని కిరణ్ బేడీ ఆశాభావం వ్యక్తం చేశారు..మరి ఇలాంటి ప్రవర్తనతో రానున్న రోజుల్లో ఆమె ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తారో వేచిచూడాలి.






