Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...హైడ్రాకు మద్దతుగా ప్రజా గర్జన్
posted on: Jul 18, 2026 5:22PM
.webp)
ప్రజా ఆస్తుల పరిరక్షణ, చెరువుల సంరక్షణ, అక్రమ ఆక్రమణల నిర్మూలనలో హైడ్రా చేపడుతున్న చర్యలకునగరంలోని పలు కాలనీ సంక్షేమ సంఘాలు, బస్తీ వాసులు, సామాజిక సంస్థల ప్రతినిధులు మద్దతు ప్రకటించారు. శనివారం (జులై 18)న వీరంతా సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. ఎన్టీఆర్ గార్డెన్స్ నుంచి సచివాలయం ఎదురుగా ఉన్న అమరవీరుల స్మారక దీపం వరకు భారీగా సాగిన ఈ ర్యాలీలో వందలాది మంది పాల్గొని హైడ్రాకు తమ మద్దతు ప్రకటించారు. ర్యాలీ సందర్భంగా హైడ్రా జిందాబాద్, జై రేవంత్ రెడ్డి, జై రంగనాథ్ అంటూ నినాదాలు చేశారు.
చేతుల్లో ప్లకార్డులతో ప్రభుత్వ భూములు, చెరువులు, పార్కులు, నాలాలు వంటి ప్రజా ఆస్తులను కాపాడేం దుకు హైడ్రా చేస్తున్న చర్యలను కొనసాగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బోడుప్పల్ అనఘారి కాలనీ, మేడి పల్లి టెలిఫోన్ కాలనీ సంక్షేమ సంఘం, వట్టినాగులపల్లి, జయలక్ష్మి కాలనీతో పాటు నగరంలోని పలు కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
ర్యాలీలో పాల్గొన్న ప్రతినిధులు మాట్లాడుతూ హైడ్రా ఏర్పడిన తర్వాత ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకు
కొత్త దిశ లభించిందన్నారు. ఎన్నో ఏళ్లుగా ఆక్రమణలకు గురైన ప్రభుత్వ భూములు, చెరువులు, నాలాలు తిరిగి ప్రజల ఆధీనంలోకి వస్తు న్నాయని పేర్కొన్నారు. గత రెండేళ్లలో లక్షల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ ఆస్తులను కబ్జాదారుల చెర నుంచి హైడ్రా కాపాడిందని వెల్లడించారు.
నగరాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ రెండింటికీ హైడ్రా చర్యలు ఎంతో ఉపయోగపడుతు న్నాయని వారు అభిప్రాయపడ్డారు. చెరువుల పునరుద్ధరణ, జలమార్గాల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వల్ల భవిష్యత్తు లో వరదల ముప్పు తగ్గడంతో పాటు నగర పర్యావరణం కూడా మెరుగుపడుతుందని చెప్పారు. గ్రేటర్ హైదరా బాద్‌లో మాత్రమే కాకుండా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో హైడ్రా తరహా వ్యవస్థను ఏర్పాటు చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.
Public outcry in support of Hydra, Huge Rally, Hyderabad, Sloguns


.webp)



