Latest News

ఇస్రో శాస్ర్తవేత్తలకు ప్రధాని అభినందనలు....

posted on: Feb 15, 2017 9:08AM

 

ఇస్రో తలపెట్టిన చారిత్రాత్మక ప్రయోగం విజయవంతమైంది. 104 ఉపగ్రహాలను ఒకేసారి పీఎస్ఎల్వీసీ-37 ద్వారా నింగిలోకి ప్రవేశపెట్టి అంతరిక్ష ప్రయోగాల్లో సరికొత్త రికార్డ్ సృష్టించింది ఇస్రో. ఈ 104 ఉపగ్రహాల్లో 101 ఉపగ్రాహాలు విదేశాలకు చెందినవి కాగా.... 3 ఉపగ్రహాలు మన దేశానికి చెందినవి. 101 ఉపగ్రహాల్లో కూడా 96 అమెరికాకు చెందినవి కాగా... ఇజ్రాయిల్‌, కజకిస్థాన్‌, నెదర్లాండ్స్‌, స్విట్జర్లాండ్‌, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌కు చెందిన ఒక్కో ఉపగ్రహం ఉన్నాయి. అయితే ఈ ప్రయోగం విజయవంతం అయినందుకు గాను ప్రధాన మంత్రి మోడీ, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందనలు తెలిపారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...