Latest News
ఐపీఎల్ దెబ్బకు పీఎస్ఎల్ విలవిల!
posted on: Mar 24, 2026 5:08PM

పాకిస్థాన్ సూపర్ లీగ్ 2026 సీజన్ ప్రారంభానికి ముందే వివాదాల్లో చిక్కుకుంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026 షెడ్యూల్‌తో పీఎస్ఎల్ క్లాష్ అవుతుండటంతో, విదేశీ ఆటగాళ్లు పాక్ లీగ్‌ను వదిలి భారత్‌కు క్యూ కడుతున్నారు. ఈ పరిణామాలపై పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ తన్వీర్ అహ్మద్ అత్యంత ఘాటుగా స్పందించారు. పీఎస్ఎల్ ఫ్రాంచైజీల యజమానులకు ఆయన బహిరంగ సవాల్ విసిరారు.
తన్వీర్ అహ్మద్ మాట్లాడుతూ.. "పీఎస్ఎల్ ఓనర్లకు నేను ఒకటే చెబుతున్నా.. మీకు అంత దమ్ముంటే, ఐపీఎల్ ఆడే ఒక్క అంతర్జాతీయ ఆటగాడినైనా పీఎస్ఎల్‌కు తీసుకురండి. ఒకవేళ మీరు అది చేసి చూపిస్తే, నేను పాకిస్థాన్ వీధుల్లో నగ్నంగా డాన్స్ చేస్తా" అంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఐపీఎల్ ముందు పీఎస్ఎల్ తేలిపోతోందని ఆయన పరోక్షంగా ఎద్దేవా చేశారు.
ప్రస్తుతం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు కేవలం రెండు వేదికల్లోనే పీఎస్ఎల్ నిర్వహించాలని నిర్ణయించింది. మార్చి 26 నుంచి ఈ టోర్నీ ప్రారంభం కానుండగా, మార్చి 28 నుంచే ఐపీఎల్ 2026 మొదలవుతోంది. దీనివల్ల పీఎస్ఎల్ కోసం ఒప్పందాలు చేసుకున్న విదేశీ ఆటగాళ్లు కూడా గాయాలనో, వ్యక్తిగత కారణాలనో చెబుతూ తప్పుకుంటున్నారు.
శ్రీలంక ఆటగాడు దాసున్ శనక, జింబాబ్వే పేసర్ బ్లెస్సింగ్ ముజారబానీ వంటి వారు ఇప్పటికే పీఎస్ఎల్ నుంచి తప్పుకుని ఐపీఎల్ ఫ్రాంచైజీలతో చేరుతుండటం పాక్ బోర్డుకు మింగుడుపడటం లేదు. తన్వీర్ అహ్మద్ స్పందిస్తూ.. ఐపీఎల్ విండోలో పీఎస్ఎల్ నిర్వహించడం పెద్ద తప్పిదమని, దీనివల్ల పాక్ లీగ్ ఒక 'జోకర్ లీగ్' లా మారిందని మండిపడ్డారు.
బీసీసీఐ ఆర్థిక శక్తి ముందు పీఎస్ఎల్ నిలబడలేదని, ఒకవేళ బీసీసీఐ అనుమతి ఇస్తే బాబర్ ఆజం, షాహీన్ అఫ్రీది వంటి పాక్ స్టార్ ప్లేయర్లు కూడా పీఎస్ఎల్ వదిలేసి ఐపీఎల్‌కు వచ్చేస్తారని తన్వీర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
మరోవైపు విదేశీ ఆటగాళ్లు ఇలా మధ్యలో వదిలేయడంపై పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ సీరియస్ అయ్యారు. నిబంధనలు ఉల్లంఘించే ఆటగాళ్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయినప్పటికీ, ఆటగాళ్లు మాత్రం భారీ ఆదాయం వచ్చే ఐపీఎల్ వైపే మొగ్గు చూపుతున్నారు.






