మంత్రి కొండా సురేఖ సభలో ప్రోటోకాల్ వివాదం

 మంత్రి కొండాసురేఖ మెదక్ జిల్లా పర్యటనలో  ప్రోటోకాల్ వివాదం రాజుకుంది. కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఈ వివాదం చెలరేగింది.  చిల్లర పనులు వద్దంటూ ఎమ్మెల్యే కొత్త కోట ప్రభాకర్ రెడ్డి కామెంట్ చేయడంతో  కాంగ్రెస్, బిఆర్ఎస్ శ్రేణుల మధ్య గొడవ జరిగింది. ఇరు వర్గాలు నినాదాలు ఇవ్వడంతో కళ్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఆటంకం వాటిల్లింది.  చేగుంట మండలంలో జరిగిన ఈ కార్యక్రమంలో  దుబ్బాక కాంగ్రెస్ ఇన్ చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. వేదిక మీద ఆయన కూర్చోవడాన్ని ఎమ్మెల్యే కొత్త కోట ప్రభాకర్ రెడ్డి అభ్యంతరం తెలపడంతో మంత్రి సూచన మేరకు వెంటనే ఆయన వెనక్కి వెళ్లి కూర్చున్నారు. కాంగ్రెస్, బిఆర్ఎస్ శ్రేణులు పోటా పోటీగా నినాదాలు ఇవ్వడంతో సభ అర్ధంతరంగా ముగిసింది.