Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...రాష్ట్రపతికి ప్రొటోకాల్ వివాదం...కేంద్రం సీరియస్
posted on: Mar 8, 2026 4:51PM

పశ్చిమ బెంగాల్ పర్యటనలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ప్రోటోకాల్ వివాదంపై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశంలో ప్రథమ పౌరురాలకి స్వాగతం పలికేందుకు ముఖ్యమంత్రి, ఉన్నతాధికారులు ఎందుకు రాలేదని ప్రశ్నించింది. రాష్ట్రపతి కోసం ఏర్పాటు చేసిన వాష్‌రూమ్‌లో నీళ్లు లేవు, ద్రౌపది ముర్ము కాన్వాయ్ వెళ్లే దారి చెత్తతో నిండిపోయింది. అంటూ ఆదివారం సాయంత్రం 5 గంటలులోగా వివరణ ఇవ్వాలని బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.
ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ , దీనిపై వివరణ ఇవ్వాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నందిని చక్రవర్తికి నోటీసులు జారీ చేసింది. ప్రొటోకాల్ ఎక్కడ విఫలమైంది? బాధ్యులెవరు? అనే అంశాలపై నివేదిక కోరింది. ఓ ఆదివాసి మహిళ అయిన రాష్ట్రపతికి బెంగాల్ ప్రభుత్వం ప్రొటోకాల్ పాటించకుండా అవమానం చేసిందని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి
అంతర్జాతీయ సంతాల్ సదస్సులో పాల్గొనేందుకు రాష్ట్రపతి ముర్ము శనివారం పశ్చిమ బెంగాల్ వెళ్లారు. అయితే ఆ సదస్సుకు బెంగాల్ సర్కార్ అనుమతి నిరాకరించడంతో.. చివరి నిమిషంలో మరోచోటికి మార్చారు. దీంతో కొద్దిమంది ప్రతినిధులు మాత్రమే అక్కడికి వచ్చారు. ప్రొటోకాల్ ప్రకారం రాష్ట్రపతిని స్వాగతించేందుకు సీఎం, మంత్రులు రావాల్సి ఉండగా రాలేదు. దీనిపై రాష్ట్రపతి అసహనం వ్యక్తం చేశారు. బెంగాల్ సర్కార్ అన్ని హద్దులు దాటిందంటూ ప్రధాని నరేంద్ర మోదీ ఈ వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.


.webp)
.webp)


