ఏపీకి పెట్టుబడుల వరద లోకేష్ చలవే.. పొగడ్తలు కురిపించిన రాయిటర్స్

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్ ప్రత్యేక కథనాన్ని వెలువరించింది. ఈ కథనంలో యువ నాయకుడు, మంత్రి నారా లోకేష్ పై ప్రశంసల వర్షం కురిపించింది. ఆంధ్ర ప్రదేశ్ లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం పదవీ బాధ్యతలు చేపట్టిన 16 నెలల స్వల్ప కాలంలోనే రాష్ట్రానికి పది లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు రావడం వెనుక  లోకేష్ శ్రమ, సమర్థతను ప్రస్తావిస్తూ రాయిటర్స్ తన ప్రత్యేక కథనంలో.. 42 ఏళ్ల యువకుడు కీలకమని పేర్కొంది. స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీలో ఎంబీయే చేసిన 42 ఏళ్ల యువకుడు నారా లోకేష్ రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడంలో కీలక శక్తిగా నిలిచారనీ, నిలుస్తున్నారనీ ఆ వ్యాసంలో పేర్కొంది.

కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా తెలుగుదేశం పార్టీ ఉండటం, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆయన తండ్రి కావడం కలిసివచ్చిన అంశాలే అయినా లోకేష్ తన ప్రతిభ, సమర్థత, వేగం, చొరవతో ఏపీని పెట్టుబడులకు గమ్యస్థానంగా మార్చగలు గుతున్నారని పేర్కొంది. 
భారత్‌లో డేటా సెంటర్ కోసం గూగుల్ స్థలాన్ని అన్వేషిస్తోందని తెలియగానే లోకేశ్ బృందం రంగంలోకి దిగి,  పన్ను విధానాలు, డేటా భద్రత వంటి అంశాలపై గూగుల్ లేవనెత్తిన సందేహాలను కేంద్ర ప్రభుత్వ పెద్దలతో చర్చించి నివృత్తి చేయడమే కాకుండా స్పష్టమైన హామీలు ఇవ్వడం ద్వారా  నెలల వ్యవధిలోనే గూగుల్ తో  ఒప్పందం ఖరారైంది. అదేవిధంగా, ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ కోసం అనుమతులు కూడా ఆఘమేఘాల మీద లభించేలా లోకేష్ చొరవ చూపారని ఆ ప్రత్యేక వ్యాసంలో రాయిటర్స్ పేర్కొంది.  లోకేష్ చెబుతున్న  స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కేవలం నినాదం కాదనీ.. అది ఆచరణలో కనిపిస్తోందని ప్రశంసించింది.  

 రాయిటర్స్ రాష్ట్రప్రభుత్వ విజయాలు, అందులో తన పాత్రపై ప్రత్యేక కథనాన్ని ప్రచురించడం పట్ల రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ హర్షం వ్యక్తం చేశారు.  వ్యాపార నిర్వహణలో వేగం, పారదర్శకత, సాహసోపేతమైన సంస్కరణల పై తమ ప్రభుత్వం  దృష్టి సారించడం వల్లే ఇది సాధ్యమైందన్నారు.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu