ప్రొఫెసర్ పావనమూర్తి కన్నుమూత
posted on Oct 27, 2025 3:31PM
.webp)
తొలితరం అంబేద్కరైట్, బుద్ధిస్ట్ ప్రొఫెసర్ చింతకాయల పావనమూర్తి (88) ఈ ఉదయం విశాఖపట్టణంలో కన్నుమూశారు. ఆయన ఆంధ్రా యూనివర్సిటీ పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ గా పనిచేశారు. ఆయన స్వస్థలం యానాం. పావనమూర్తి ద్వారా ఎంతోమంది అంబేడ్కర్ని, బౌద్దాన్ని చదువుకుని క్షేత్రస్థాయి ఉద్యమకారులుగా, మేధావులుగా మారారు. ఆయన ప్రభావం గోదావరి జిల్లాలు, కళింగాంధ్రలో ఎక్కువగా వుంటుంది. చాలామంది ప్రముఖులు పావన మూర్తి శిష్యులం అని గర్వంగా చెప్పుకుంటారు.
అంబేద్కరైట్స్ కి విశాఖ అనగానే గుర్తుకొచ్చేది పావనమూర్తి ! అంబేడ్కరైట్ భావజాల వ్యాప్తి కోసం మేధో రంగంలో పనిచేస్తున్న ప్రొఫెసర్ ప్రజ్ఞ, సత్యపాల్ ఆయన కూతురు, అల్లుడు తొలితరం అంబేద్కరైట్, బౌద్ధధమ్మ ప్రచారకులు ఒక తరాన్ని ఉద్యమకారులుగా, బుద్ధి జీవులుగా బాబాసాహెబ్ అంబేద్కర్ దారిలో నడిపిన ప్రభావశీలి ప్రొఫెసర్. సి. పావనమూర్తికి పలువురు మేధావులు నివాళులర్పించారు