తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్‌ను కలిసిన ప్రొఫెసర్ నాగేశ్వర్

posted on: May 26, 2026 5:36PM

 

తనకు భద్రత కల్పించాలని  పోలీస్ బాస్‌ను కోరిన మాజీ ఎమ్మెల్సీ..

 తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్‌ను ప్రొఫెసర్ నాగేశ్వర్‌ కలిశారు. తనకు ప్రాణహాని ఉందని తగిన సెక్యూరిటీ ఇవ్వాలని ఆయన వ్యక్తగత లాయర్‌తో కలిసి డీజీపీకి విజ్ఞప్తి చేశారు. దీనిపై సానుకూలంగా స్పదించిన డీజీపీ తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

మరోవైపు మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్‌ను అరెస్ట్ చేసేందుకు ఏపీ పోలీసులు తెలంగాణకు వెళ్లారంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇది పూర్తిగా నిరాధారమైనదని, కొందరు ఉద్దేశపూర్వకంగా వ్యాప్తి చేస్తున్న దుష్ప్రచారమని తేల్చిచెప్పింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వ అధికారిక ఫ్యాక్ట్ చెక్ విభాగం 'ఎక్స్' వేదికగా ఓ పోస్ట్ ద్వారా వెల్లడించింది. తెలుగుదేశం పార్టీ కూడా ఈ పోస్ట్ ను షేర్ చేసింది.

కొద్ది రోజుల క్రితం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు సంబంధించి ఓ టీవీ చర్చా కార్యక్రమంలో ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. ఈ వ్యాఖ్యలపై జనసేన కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కాకినాడ ప్రాంతంలోని సర్పవరం, ఇంద్రపాలెం వంటి పలు పోలీస్ స్టేషన్లలో ప్రొఫెసర్ నాగేశ్వర్‌పై వివిధ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ లు నమోదు చేశారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...