Latest News

రోడ్డు ప్రమాదంలో ప్రైవేటు బస్సు దగ్ధం.. ముగ్గురు సజీవ దహనం

posted on: Jan 22, 2026 9:27AM

నంద్యాల జిల్లాలో  ఈ ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు సజీవదహనమయ్యారు.  నెల్లూరు నుంచి  36 మంది ప్రయాణీకులతో హైదరాబాద్ వెడుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు టైరు పేలడంతో ఈ ప్రమాదం జరిగింది. శిరివెళ్లమెట్ట వద్ద బస్సు టైర్ పేలడంతో బస్సు అదుపుతప్పి డివైడర్ ను దాటి  ఎదురుగా వస్తున్న కంటైనర్ లారీని బలంగా ఢీకొట్టింది.

దీంతో బస్సులో మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో   ప్రైవేటు బస్సు టైరు పేలడంతో అదుపుతప్పి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో బస్సు డ్రైవర్, క్లీనర్, లారీ డ్రైవర్,  సజీవ దహనమయ్యారు.  కాగా అదే సమయంలో అటుగా వెడుతున్న ఓ డీసీఎం డ్రైవర్ తన వాహనాన్ని నిలిపివేసి బస్సులో ప్రయాణీకులను అప్రమత్తం చేయడమే కాకుండా, బస్సు కిటికీల అద్దాలను పగులగొట్టడంతో ప్రయాణీకులు సురక్షితంగా బయటపడ్డారు.   పదిహేను మంది   గాయపడ్డారు. డీసీఎం డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించడం వల్ల భారీ ప్రాణనష్టం తప్పింది.  

కాగా ఈ ఘటనలో బస్సు, లారీ పూర్తిగా దగ్ధమయ్యాయి.   బస్సు డ్రైవర్, లారీ డ్రైవర్, క్లీనర్‌ల మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా కాలిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరు కుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  

google-ad-img
    Related Sigment News
    • Loading...