Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు.. ప్రయాణీకులు సురక్షితం
posted on: May 15, 2026 10:35AM
.webp)
ఆంధ్రప్రదేశ్ లో మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు మంటల్లో దగ్ధమైంది. హైదరాబాద్ నుంచి తిరుపతి వెడుతున్న కావేరీ ట్రావెల్స్ బస్సులో ఉలవలపాడు సమీపంలో ఇంజన్ నుంచి పొగలు రావడం గమనించిన డ్రైవర్.. అప్రమత్తమై ప్రయాణీకులును కిందికి దించేశాడు.
ఆ తరువాత క్షణాల్లోనే బస్సంతా మంటలు వ్యాపించాయి. ఈ ఘటన శుక్రవారం ( మే 15) తెల్లవారు జామున జరిగింది. మంటల్లో బస్సు పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. షార్ట్ సర్క్యూట్ ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.






