Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...విజయ్ దేవరకొండ, రష్మిక వివాహ రిసెప్షన్ కు ప్రధాని మోడీ?
posted on: Feb 27, 2026 1:21PM

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ టాలీవుడ్ నయా కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక వివాహ రిసెప్షన్ కు హాజరౌతారా? అంటే ఔననే అంటున్నాయి సినీ వర్గాలు. ఈ జంట తమ వివాహం అనంతరం ప్రధాని మోడీని కలిసింది. తమ వివాహ రిసెప్షన్ కు రావాల్సిందిగా కోరుతూ ఆయనను ఆహ్వానించారు.
మార్చి 4న జరగనున్న తమ వివాహ రిసెప్షన్‌కు రావాలని ప్రధానిని ఆహ్వానించింది.
రాజస్థాన్‌లో అంగరంగ వైభవంగా డెస్టినేషన్ మ్యారేజ్ చేసుకున్న రష్మిక, విజయ్దేవరకొండ తమ వివాహరిసెప్షన్ ను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే వారిరువురూ కలిసి ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీని ఆయన నివాసంలో కలిసి తమ పళ్లి రిసెప్షన్ కు ఆహ్వానించారు.
నిజానికి వీరిరువురూ ప్రధాని మోడీని తమ వివాహానికి ముందే కలిశారు. అయితే ఇందుకు సంబంధించిన ఫొటోలను తాజాగా విడుదల చేఇారు. కాగా వీరి వివాహ రిసెప్షన్ వచ్చే నెల 4న హైదరాబాద్‌లోని ఐకానిక్ తాజ్ కృష్ణ హోటల్‌లో జరగనుంది. ఈ రిసెప్షన్ కు సినీ, రాజకీయ, క్రీడా రంగాలకు చెందిన పలువురు సెలబ్రిటీలు హాజరుకానున్నారని చెబుతున్నారు.






