Latest News

ప్రధాని విమానంలో గ్రెనేడ్!

posted on: Oct 4, 2014 1:18PM

 

ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటనకు బయలుదేరుతున్నపుడు ఆయన కోసం ఎయిర్ ఇండియా వారి మరొక బోయింగ్-747 విమానం డిల్లీలో ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో స్టాండ్-బైగా సిద్దం చేసి ఉంచారు. ఒకవేళ మోడీ పయనించబోయే ప్రత్యేక విమానంలో ఏవయినా సాంకేతిక సమస్యలు తలెత్తినట్లయితే, ఆ స్టాండ్-బై విమానంలో అమెరికా బయలుదేరి ఉండేవారు. అందువల్ల ఆ విమానాన్ని భద్రతా దళాలు తమ అధీనంలోనికి తీసుకొని క్షుణ్ణంగా తనికీలు నిర్వహిస్తాయి. కానీ మోడీ అమెరికా యాత్రను దిగ్విజయంగా పూర్తి చేసుకొని భారత్ తిరిగివచ్చేసిన తరువాత దానిని తిరిగి ఎయిర్ ఇండియా సంస్థకు అప్పగించేశారు.

 

ఆ తరువాత ఆ విమానంలో సాధారణ ప్రయాణికులను తీసుకొని డిల్లీ నుండి ముంబై- హైదరాబాద్ మీదుగా-సౌదీ అరేబియా దేశంలోని జెడ్డా అంతర్జాతీయ విమానాశ్రయంలో సోమవారం తెల్లవారుజామున దిగినప్పుడు, ఆ విమానపు బిజినెస్ క్లాసులో నిర్వీర్యం చేయబడిన ఒక గ్రెనేడ్ దొరకడం సంచలనం సృష్టించింది.

 

దానిని మోడీ ప్రయాణానికి ముందుగానే విమానంలో అమర్చబడి, ఆయన దానిని ఉపయోగించకపోవడంతో నిర్వీర్యం చేయబడిందా? లేక డిల్లీ, ముంబై, హైదరాబాదు మూడు విమానాశ్రయాలలో ఎక్కడయినా ఎవరయినా విమానాన్ని హైజాక్ చేసే ఉద్దేశ్యంతో లోపలకి తీసుకువచ్చేరా? తెచ్చి ఉండి ఉంటే ఎందుకు ఎప్పుడు నిర్వీర్యం చేసారు? అసలు ఆ బాంబుని ఎవరు, ఎప్పుడు, ఎందుకు తీసుకు వచ్చేరు? సాధారణ ప్రయాణికులను, విమానాన్నయినా బయలుదేరేముందు క్షుణ్ణంగా తనికీ చేసినపుడు అది ఏవిధంగా లోపాలకి వచ్చింది? అనే విషయం తెలుసుకొనేందుకు దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ఏమయినప్పటికీ ఇది చాలా దిగ్బ్రాంతి కలిగించే విషయమని అంగీకరించక తప్పదు.

google-ad-img
    Related Sigment News
    • Loading...