Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...విశాఖకు చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
posted on: Feb 17, 2026 5:56PM

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, విశాఖపట్నానికి చేరుకున్నారు. ఈ సందర్బంగా రాష్ట్రపతికి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, రాష్ట్ర మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి సాదరంగా స్వాగతం పలికారు. రేపు విశాఖ తీరంలో జరుగనున్న అంతర్జాతీయ యుద్ధనౌకల సమీక్ష-2026కు రాష్ట్రపతి పాల్గోనున్నారు. భారత సాయుధ దళాల సుప్రీం కమాండర్‌గా ఆమె ఈ సమీక్షను పర్యవేక్షిస్తారు.
ఈ కార్యక్రమంలో భారత నౌకాదళంతో పాటు పలు విదేశీ యుద్ధనౌకలు కూడా పాల్గొంటాయి.ఈ పర్యటనలో భాగంగా, ఫిబ్రవరి 19న జరిగే 'మిలన్ అంతర్జాతీయ సిటీ పరేడ్', 20న నిర్వహించే 'కాన్‌క్లేవ్ ఆఫ్ చీఫ్స్' కార్యక్రమాల్లో కూడా ద్రౌపది ముర్ము పాల్గొంటారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో విశాఖ నగరంలో పోలీసులు, నౌకాదళ అధికారులు పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.



.webp)


