విశ్వవిజేతగా నిలిచిన మహిళల క్రికెట్ జట్టుకు రాష్ట్రపతి, మోడీ అభినందనలు
posted on Nov 3, 2025 1:29AM
.webp)
వరల్డ్ కప్ విజేతగా నిలిచిన భారత మహిళల క్రికెట్ జట్టుకు రాష్ట్రపతి ద్రౌపదిముర్ము, ప్రధాని మోడీ అభినందనలు తెలిపారు. జట్టు విజయంలో పాలుపంచుకున్న ప్రతి క్రీడాకారిణికీ హృదయపూర్వక అభినందనలు అంటూ రాష్ట్రపతి ద్రౌపదిముర్ము సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో పేర్కొన్నారు. తొలి సారి విశ్వవిజేతగా నిలవడం ద్వారా చరిత్ర సృష్టించారని పేర్కొన్నారు.
.webp)
అలాగే ఈ విజయాన్ని ఒక చారిత్రకఘట్టంగా అభివర్ణించిన ప్రధాని మోడీ, ఈ విజయం భవిష్యత్ క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలుస్తుందని పేర్కొంటూ ట్వీట్ చేశారు. జట్టులో అందరూ సమష్టిగా రాణించారని పేర్కొన్న ఆయన జట్టులోని ప్రతిఒక్కరినీ హృదయపూర్వకంగా అబినందిస్తున్నట్లు పేర్కొన్నారు.