16వ శతాబ్ది నాటి సూగురు దేవాలయాన్ని భద్రపరచాలి.. ఈమని శివనాగిరెడ్డి

వనపర్తి జిల్లా పెబ్బేరు మండలంలోని సూగూరు గ్రామంలో దాదాపు 400 సంవత్సరాల కిందట సూగూరు సంస్థానా దీశులు నిర్మించిన వైష్ణవాలయాన్ని భద్రపరచి పరిరక్షించాలని పురావస్తు పరిశోధకుడు ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి అన్నారు. శనివారం అయన జిల్లాలోని పురాతన శిల్ప సంపదను గుర్తించి వాటి చారిత్రక ప్రాధాన్యతపై గ్రామస్తులకు అవగాహన కల్పించే కార్యక్రమంలో భాగంగా ఆయన సుగూరు  ఆలయాన్ని సందర్శించారు.

గర్భాలయం, అర్థ మండపం వరకూ, అధిష్టానం,పాదవర్గం ,ప్రస్తరం వరకూ ఉన్న ఈ ఆలయ గోడలపై అపురూప శిల్పాలు ఉన్నాయని కప్పు పైన  శిథిలమైన శిఖరాన్నీ బాగు చేసి ఆలయానికి పూనర్వవైభవం తీసుకురావడానికి కృషి చేయాలని గ్రామస్తులకు నాగిరెడ్డి విజ్ఞప్తి చేశారు. అనంతరం దిగుడు బావిని, కోట ద్వారాన్ని  వీరభద్ర ఆలయం దగ్గర రోడ్డుపై న నిర్లక్ష్యంగా పడి ఉన్న చాళుక్యుల కాలపు మూడు నందులు, మూడు గణేష్ విగ్రహాలు, సప్తమాతృకలు శైవాచార్యులు, వీరభద్రుడు, భద్రకాళి శిల్పాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తుడు సితార వెంకటేశ్వర్లతో పాటు నాగర్ కర్నూల్ వెన్నెల సాహిత్య అకాడమీ అధ్యక్షులు ముచ్చర్ల దినకర్, కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు డాక్టర్ బై రోజు శ్యాంసుందర్ తోపాటు గ్రామస్తులు  పాల్గొన్నారని తెలిపారు.