400 ఏండ్ల నాటి రంగాపూర్ శివాలయాన్ని పదిలపరచాలి

పురావస్తు పరిశోధకుడు డాక్టర్ ఈమని శివ నాగిరెడ్డి

పెబ్బేరు మండలానికి నాలుగు  కిలోమీటర్ల దూరంలో ఉన్న బ్రిడ్జి రంగాపూర్ లోని ఓటి గుడిని పరిరక్షించాలని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి అన్నారు.   గ్రామానికి చెందిన బైనగిరి రామచంద్రారెడ్డి ఇచ్చిన సమాచారం మేరకు  శనివారం (జనవరి18) ఆలయాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వనపర్తి సంస్థానానికి చెందిన జనంపల్లి రంగారెడ్డి 400 సంవత్సరాల క్రితం విజయనగర వాస్తు శిల్ప శైలిలో  శివాలయాన్ని నిర్మించాడని, ఆలయ గోడలు ద్వారా శిల్పా ల పై అనేక పౌరాణిక శిల్పాలు  
ఆకర్షణియంగా తీర్చిదిద్దబడి నాయని, ఆలయ శిఖరం పై కప్పల భాగం వరకు కూలిపోయిందని , చారిత్రక ప్రాధాన్యత గల ఈ ఆలయాన్ని  పునరుద్ధరించాలనీ గ్రామస్తులకు శివ నాగిరెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వెన్నెల సాహిత్య అకాడమీఅధ్యక్షులు ముచ్చర్ల దినకర్, కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు డాక్టర్ బై రోజు శ్యాంసుందర్  పడే సాయి, కరుణాకర్ రెడ్డి, అద్దంకి రవీంద్ర, గ్రామస్తులు చిరంజీవి, తదితరులు పాల్గొన్నారని తెలిపారు.