బంకీపూర్ ఉప ఎన్నికలో పీకే విజయం.!

posted on: Aug 3, 2026 6:04PM

బీహార్ లోని  బంకీపూర్ అసెంబ్లీ నియోజక వర్గ ఉపఎన్నికలో జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు, ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త  ప్రశాంత్ కిషోర్  విజయం సాధించారు.  మూడు దశాబ్దాలుగా బీజేపీకి కంచుకోటగా ఉన్న బంకీపూర్ నియోజకవర్గం నుంచి పీకే సాధించిన ఈ విజయం బీహార్ రాజకీయాలలో సంచలనంగా మారింది. పీకే తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ సిన్హాపై  20 వేలకుపైగా ఓట్ల మెజారిటీతో  విజయం సాధించారు.

 ఈ నియోజకవర్గం నుంచి 1995 నుంచీ వరుసగా బీజేపీయే విజయం సాధిస్తూ వస్తోంది.   నవీన్ కిషోర్ ప్రసాద్ సిన్హా వరుసగా నాలుగు సార్లు విజయం సాధించగా, ఆ తరువాత ఇదే నియోజకవర్గం నుంచి  ఆయన కుమారుడు, ప్రస్తుతం బీజేపీ జాతీయ అధ్యక్షుడు  నితిన్ నబీన్ వరుసగా విజయం సాధిస్తూ వచ్చారు. ఇటీవల నితిన్ నబీన్ ను బీజేపీ రాజ్యసభకు పంపడంతో బంకీపూర్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది.  ఈ ఎన్నికలో ప్రశాంత్ కిషోర్ అనూహ్యంగా విజయం సాధించి బీజేపీకి గట్టి షాక్ ఇచ్చారు.  

Prashantkumar win bamkipur by poll, election, Straregist, Shock, BJP

google-ad-img
    Related Sigment News
    • Loading...