జగన్ కు పీకే గుడ్ బై... మోడీ ఫోర్స్
posted on Feb 27, 2018 9:08AM

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ జగన్ కు గుడ్ బై చెబుతున్నారా..?అంటే అవుననే సంకేతాలే కనిపిస్తున్నాయి. త్వరలోనే జగన్ ను వీడి ప్రధాని మోడీ టీంలో జాయిన్ అవుతారన్న టాక్స్ వినిపిస్తున్నాయి. అసలు సంగతేంటంటే... ప్రశాంత్ కిషోర్ గత కొద్దికాలంగా జగన్ కు ఎన్నికల వ్యూహకర్తగా పనిచేస్తున్నారు. గత ఆరు నెలలుగా ప్రధాని మోడీ, ప్రశాంత్ కిషోర్ ఇద్దరూ రెగ్యులర్ టచ్ లో ఉన్నారు. గడచిన నెల రోజుల్లోనే 2 సార్లు వీళ్లద్దరూ భేటీ అయ్యారు. అయితే 2019 ఎన్నికలు దగ్గర్లోనే ఉన్నాయి...ఈ నేపథ్యంలో ఆయన మోడీ టీంలోకి వెళుతున్నారు. అంతేకాదు... మీరు మా టీంలోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.. ఎంత త్వరగా వస్తే అంత మంచిది అని మోడీ ప్రశాంత్ కిషోర్ ను కోరారట. ఇక సాక్ష్యాత్తు ప్రధానిమంత్రే అడగడంతో.. ఆరు నెలలుగా ఇద్దరి మధ్య జరుగుతున్న మంతనాలతో త్వరలోనే జగన్ ను వదిలేసి.. మోడీ టీంలోకి జాయిన్ కానున్నారు..
అయితే మోడీతో కలిసి ప్రశాంత్ కిషోర్ పనిచేయడం ఇదేం మొదటిసారికాదు. 2012 నుంచి పీకేతో మోడీకి పరిచయం. 2012లో బీజేపీ గుజరాత్ కోసం పని చేశారు. ఆ తర్వాత 2014 ఎన్నికల కోసం గుజరాత్ నుంచి ఢిల్లీకి తీసుకొచ్చారు మోడీ. గత ఎన్నికల్లో అఖండ విజయం సాధించారు. ఆ తర్వాత యూపీ, బీహార్ కు పని చేశారు. అయితే బీహార్ లో బీజేపీ ఓడిపోయింది. దాంతో తర్వాత మోడీ టీం నుంచి తప్పుకున్నారు. అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్తగా వచ్చారు.. మళ్లీ ఇప్పుడు పీకే ను తమ టీంలోకి తీసుకోవాలని మోడీ ఒత్తిడి చేస్తున్నారట. ఈ క్రమంలోనే ఆరు నెలలుగా పీకేతో చర్చలు జరుపుతున్నారని... ఇప్పుడు ఆ చర్చలు ఓ కొలిక్కి వచ్చాయని...మార్చి మొదటి వారంలోనే పీకే.. జగన్ కు గుడ్ బై చెప్పనున్నారని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అంతేకాదు జగన్ కూడా ఈ విషయంలో కలవరపడుతున్నాడట. మరి ఈ వార్తల్లో ఎంత నిజముందో... నిజంగానే పీకే జగన్ ను వదిలివెళతాడా..? అన్నది చూడాలి...