Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...కాంగ్రెస్, ఆర్జేడీ మద్దతు కోరిన ప్రశాంత్ కిశోర్.. ఏ విషయంలోనో తెలుసా?
posted on: Jul 6, 2026 1:12PM

ఎన్నికల వ్యూహకర్తగా ఇండియన్ పోలిటికల్ ఫీల్డ్ లో ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ కిశోర్ అలియాస్ పీకే.. ప్రత్యక్షంగా ఎన్నికల బరిలో దిగనున్నారు. సొంతంగా జన్ సూరజ్ పార్టీ స్థాపించి ఇటీవలి బీహార్ ఎన్నికలలో ఘోరంగా విఫలమైన ప్రశాంత్ కిశోర్.. ఆ ఎన్నికలలో తాను బరిలోకి దిగలేదు కానీ.. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలలోనూ తన పార్టీ అభ్యర్థులను రంగంలోకి దింపారు. అయితే ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
బీహార్‌లోని అ ప్రతిష్టాత్మక బంకీపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఈ నెల 30న జరగనున్న ఉప ఎన్నికలో తాను బరిలోకి దిగి పోటీ చేయనున్నట్లు ప్రశాంత్ కిశోర్ స్వయంగా చెప్పారు. పాట్నాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రశాంత్ కిశోర్ ఈ విషయాన్ని వెల్లడించారు. బంకీపూర్.. 2006 నుండి ఈ స్థానం నుంచి బీజేపీయే విజయం సాధిస్తూ వస్తోంది. ఇటీవల జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో ఈ స్థానం నుంచి బీజేపీ సీనియర్ నేత నితిన్ నబీన్ విజయం సాధించారు. అయితే ఆ తరువాత అంటే ఈ ఏడాది ఏప్రిల్ లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. దాంతో ఆయన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. నితిన్ నబీన్ రాజీనామాతో ఖాళీ అయిన ఈ స్థానానికి ఈ నెల 30న ఉప ఎన్నిక జరగనుంది. రెండు దశాబ్దాలుగా బీజేపీకి కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ప్రశాంత్ కిశోర్ నిర్ణయించుకున్నారు.
కాగా తన పోటీ విషయాన్ని ప్రకటించిన మీడియా సమావేశంలోనే.. ప్రశాంత్ కిశోర్ ఈ ఉప ఎన్నిక రాష్ట్రంలోని బీజేపీ సర్కార్ కు రెఫరెండంగా అభివర్ణించారు. మార్పు కోరుతూ తనకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. అంతే కాకుండా.. ఈ ఉప ఎన్నికలో తనకు మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్, ఆర్జేడీలను సైతం ప్రశాంత్ కిశోర్ కోరారు.
అవపకమైతే అధికార బీజేపీని తనకు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుతానని ప్రశాంత్ కిశోర్ అన్నారు. అయితే బంకీపూర్ స్థానం నుంచి బరిలోకి దిగుతామని ఆర్జేడీ ఇప్పటికే ప్రకటించింది. ఇక బీజేపీ సొంత స్థానం అయిన బకీంపూర్ ను ప్రశాంత్ కిశోర్ కు మద్దతు ఇచ్చి వదులుకునే అవకాశాలు ఇసుమంతైనా లేవు. ఈ పరిస్థితుల్లోబంకీపూర్ లో ప్రశాంత్ కిశోర్ ఏ మేరకు రాణిస్తారన్న విషయంపై రాజకీయవర్గాలు పెదవి విరుస్తున్నాయి.
Bankipur by election, Jan Suraaj Party, Bihar politics, Nitin Nabin






