ప్రకాష్ రాజ్ ఓటు తొలగింపుపై ఈసీ క్లారిటీ.!

posted on: Aug 12, 2026 2:03PM

ప్రముఖ నటుడు  ప్రకాష్ రాజ్  నిత్యం సామాజిక, రాజకీయ అంశాలపై స్పందిస్తూ వార్తల్లో నిలుస్తుంటారన్న సంగతి తెలిసిందే. తరచుగా ఆయన వ్యాఖ్యలు వివాదాస్పదమౌతాయి. తాజాగా తన ఓటు తొలగింపుపై ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్ కూడా తీవ్ర సంచలనం సృష్టించింది. తన ఓటు హక్కును సర్ లో భాగంగా తొలగించారంటూ... ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్ తెగ వైరల్ అయ్యింది. ఆ ట్వీట్ లో ప్రకాష్ రాజ్.. ఎన్నికల సంఘం తీరుపై ఓ రేంజ్ లో విమర్శలు గుప్పించారు. ప్రకాష్ రాజ్ ట్వీట్ తెగ వైరల్ అయ్యింది. 

ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం స్పందించింది. ప్రకాష్ రాజ్ ఓటు తొలగింపుపై క్లారిటీ ఇచ్చింది.  ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా తన ఓటును కావాలనే తొలగించారంటూ ప్రకాష్ రాజ్ చేసిన ఆరోపణలను ఖంచించిన ఈసీ.. . ప్రకాష్ రాజు ఓటు తొలగించలేదనీ,  నిబంధనల ప్రకారం  షిఫ్టెడ్  (చిరునామా మారిన) జాబితాలో చేర్చినట్లు   వెల్లడించింది.  విషయమేంటంటే..  బెంగళూరు శాంతినగర్ శాసనసభ నియోజకవర్గంలో ప్రకాష్ రాజ్ ఓటరుగా నమోదయ్యారు.  ఓటర్ల జాబితా పునఃపరిశీలన సమయంలో ఎన్నికల సిబ్బంది ఆయన పేర్కొన్న చిరునామాకు వెళ్లి విచారణ జరిపారు. ఆ సందర్భంగా సదరు అపార్ట్‌మెంట్‌లో ప్రకాష్ రాజ్ గడచిన నాలుగు సంవత్సరాలుగా నివసించడం తేలింది.  నివాసం ఉండని వ్యక్తి పేరును ఆ ప్రాంత ఓటర్ల జాబితాలో  కొనసాగించడం నిబంధనలకు విరుద్ధం  కావడంతో.. అధికారులు ఆయన పేరును   చిరునామా మారిన ఓటర్ల కేటగిరీ కింద వర్గీకరించారు.

ఎన్నికల నిబంధనల ప్రకారం ఏ వ్యక్తి అయినా ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి నివాసాన్ని మార్చినప్పుడు, వారి వివరాలను తాత్కాలికంగా స్థానిక జాబితాలో  షిఫ్టెడ్ అని నమోదు చేయడం రివాజు.  ప్రకాష్ రాజ్ పేరు కూడా ఓటర్ల జాబితాలో షిప్టెడ్ కేటగిరిలో నమోదు చేసినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ప్రస్తుతం ప్రకాష్ రాజ్ శాంతినగర్ నియోజకవర్గం పరిధిలోనే వేరు ఇంట్లో ఉంటున్నారు. దీంతో ఎన్నికల అధికారులు ఆయన  ప్రస్తుతం నివసిస్తున్న కొత్త చిరునామా ఆధారాలతో ఫారమ్ 6 సమర్పించడం ద్వారా ఓటర్ల జాబితాలో   పేరును సులభంగా పునరుద్ధరించుకోవచ్చన్నారు. ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ విధానంలో నిబంధనల మేరకు దరఖాస్తు చేసుకుంటే, ఆయన ప్రస్తుత నివాసం అడ్రస్ తో  కొత్త ఓటరు  కార్డును మంజూరు చేస్తామని ఎన్నికల అధికారులు పేర్కొన్నారు.  

Prakash Raj vote deletion controversy, Bengaluru SIR voter list revision, Election Commission clarification Prakash Raj, Prakash Raj voter ID status, BBMP voter list update, Prakash Raj Bengaluru Central

google-ad-img
    Related Sigment News
    • Loading...