విశాఖ భాగస్వామ్య సదస్సులో లోకేష్ పై పారిశ్రామిక వేత్తల ప్రశంసలు

విశాఖ వేదికగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్న ఐసీసీ భాగస్వామ్య సదస్సు రాష్ట్రానికి వివిధ పారిశ్రామిక సంస్థల నుంచి లక్షల కోట్ల పెట్టుబడులకు గేట్ వేగా మారింది.  ఈ సదస్సు ఇంత విజయవంతంగా జరగడానికి, ఈ స్థాయిలో పెట్టుబడులు వెల్లువెత్తడానికి వెనుక ఉన్న డ్రైవింగ్ ఫోర్స్ నారా లోకేష్ అంటున్నారు. ఈ మాట తెలుగుదేశం పార్టీ శ్రేణులు, నాయకులు, ప్రభుత్వ అధికారులు కాదు.. ఈ సదస్సులో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందాలు కుదుర్చుకున్న, కుదుర్చుకోవడానికి సిద్ధంగా ఉన్న పారిశ్రామిక వేత్తలు, పెట్టుబడి దారులూ చెబుతున్నారు. 
రాష్ట్రంలో తమ ప్రాజెక్టులను ఏర్పాటు చేస్తున్న కంపెనీలతో ఒప్పందాలను ఖరారు  కావడం, వారితో సమన్వయం చేయడంలోనూ లోకేష్ కీలక పాత్రపోషించారు. అందులో సందేహం లేదు. విశాఖలో భాగస్వామ్య సదస్సు విజయవంతం కావడానికి చంద్రబాబు ట్రాక్ రికార్డ్, విజన్ రాష్ట్రానికి పారిశ్రామిక వేత్తలు పెట్టుబడులతో తరలిరావడానికి ఒక కారణమైతే.. లోకేష్ పెట్టుబడులను ఆకర్షించే విషయంలో చూపిన నిబద్ధత, అందుకోసం చేసిన కృషి మరో ప్రధానకారణమంటున్నారు.   

ఈ విషయాన్ని కేంద్ర మంత్రి పియూష్ గోయెల్ సహా సీనియర్ కేంద్ర మంత్రులూ గుర్తించారు. అందుకే రాష్ట్ర ప్రగతి విషయంలో వారు చంద్రబాబు విజన్ ను ఎఫిషియెన్సీనే కాకుండా.. లోకేష్ ప్రతిభనూ, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఆయన చూపిన చొరవనూ ప్రశంసలతో ముంచెత్తారు.   ఆదానీ గ్రూప్ ఏపీలో నలభైవేల కోట్ల రూపయాలు ఇన్వెస్ట్ చేయడమే కాకుండా, ముందు ముందు మరింత ఇన్వెస్ట్ చేయబోతున్నట్లు ప్రకటించడం వెనుక లోకేష్ చోరవ, ఆయన కనబరిచన శ్రద్ధ, అందించిన మద్దతు కారణమని ఆ సంస్థ ప్రతినిథులే పేర్కొన్నారు.  

ఎస్ వైఆర్ఎమ్ఏ ఎస్జీఎస్ మేనేజింగ్ డైరెక్టర్ జస్బీర్ ఎస్ గుజ్రాల్ లోకేష్ పై ప్రశంసల వర్షం కురిపించారు. తమ కంపెనీకి ప్రభుత్వం నుండి అన్ని అనుమతులు, క్లియరెన్సులు కేవలం పధ్నాలుగు రోజుల్లోనే వచ్చాయనీ, దీని వెనుక ఉన్న చురుకైన పాత్ర లోకేష్ దేనని ఆయన పేర్కొన్నారు. పెట్టుబడులను ఆకర్షించడానికి అపూర్వమైన చురుకైన చర్యలు తీసుకువచ్చినందుకు ఆయన లోకేష్‌ను ప్రశంసించారు. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu