Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...బ్రిటన్ మహారాణికి దాకా పాకిన బాహుబలి క్రేజ్
posted on: Mar 1, 2017 2:00PM

బాహుబలి ది కన్ క్లూజన్ వచ్చేస్తోంది! తెలుగు వారందరికీ ఎగ్జైటింగ్ గానే వుంది. ఇన్ ఫ్యాక్ట్ ఇండియన్స్ అందరికీ కూడా ఆసక్తిగానే వుంది. అందుక్కారణం, బాహుబలి టూ రిలీజైతే కట్టప్ప ఎందుకలా పొడిచేశాడో తెలిసిపోతుంది కాబట్టి! కాని, ఏప్రెల్ లో రాబోతోన్న మన రాజమౌళి మాస్టర్ పీస్ కేవలం కట్టప్ప వల్లే వార్తల్లో నిలవటం లేదు. ఇంకా చాలా విషయాల వల్ల అందరి దృష్టిని ఆకర్షిస్తోంది! అయితే, తాజాగా వినిపిస్తోన్న బాహుబలి న్యూస్ అయితే మీరు అస్సలు నమ్మలేరు! బాహుబలి మనకంటే ఒక్కరోజు ముందే... బ్రిటన్ మహారాణి చూసే అవకాశం వుందట!
బాహుబలి అంటే మాహిష్మతి రాజ్యపు కథ. ఆ రాజ్యాన్ని రక్షించిన బాహుబలి కథ! అయితే, బాహుబలిలో ప్రభాస్, రానా లాంటి రాజులే కాదు అనుష్క, తమన్నా లాంటి అందాల రాణులు కూడా వున్నారు. నిజానికి బాహుబలి సెకండ్ ఇన్ స్టాల్మెంట్ లో దేవసేనగా అనుష్కా ఎలా మెస్మరైజ్ చేస్తుందనేదే ఇప్పుడు అందరి ఆలోచన కూడా! కాకపోతే, ఇప్పుడు తాజా సంచలనం ఏంటంటే, మన మాహిష్మతి రాజుల్ని, రాణుల్ని మనకంటే ముందుగా బ్రిటన్ రాణి చూడబోతోందట. ఇంకా ఈ న్యూస్ కన్ ఫర్మ్ కాలేదు కాని... పరిస్థితి చూస్తుంట బాహుబలి టూ ప్రీమియర్ క్వీన్ ఎలిజబెత్ టూ సమక్షంలో జరిగేలా వుంది!
బాహుబలి పార్ట్ టూని జక్కన్న ఏప్రెల్ 28న ప్లాన్ చేశాడు. అయితే, అంతకు ఒక్క రోజు ముందు బాహుబలి బ్రిటన్ ప్రీమియర్ వుంటుందట. మామూలుగా అయితే, దీనికి తెలుగు ఆడియన్స్, ఇండియన్ ఆడియన్స్ ఎగబడతారు. కాని, ఏప్రెల్ 27న బాహుబలి ప్రీమియర్ ఊరికే వేయటం లేదు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 70ఏళ్లు అవుతోన్న సందర్భంగా బ్రిటన్ లో భారతీయ సంబరాలు జరగబోతు్న్నాయి. ఏప్రెల్ నుంచీ డిసెంబర్ దాకా మన సినిమాలు ప్రదర్శిస్తారు. అందులో మొదటి రోజే బాహుబలి ప్రదర్శన వుండనుందట! సో... బ్రిటన్, ఇండియా సంయుక్త సంబరాల తొలి రోజు కాబట్టి బకింగ్ హామ్ ప్యాలెస్ మహారాణి హాజరైతీరతారు. బాహుబలి కూడా తిలకించే ఛాన్స్ వుంది!
వందేళ్లు పూర్తి చేసుకున్న భారతీయ సినిమా బ్రిటన్ బానిసత్వం నుంచి బయటపడ్డాక బోలెడంత ఎదిగింది. ఈ డెబ్బై ఏళ్లలో మనం సాధించిన వెండితెర వేగం... బాహుబలి రూపంలో బ్రిటన్ రాణికి అర్థమైతే... మనకు అంతకన్నా గర్వకారణం ఏం వుంటుంది!


.jpg)


