జనసేన తొలి సభ... సంగారెడ్డిలో పెట్టడానికి కారణమేంటి?

posted on: Mar 15, 2017 5:11PM

తెలంగాణలోనూ జనసేన పోటీ చేస్తుందని ప్రకటించిన పవన్ కల్యాణ్‌... మొదటి సభను సంగారెడ్డిలో నిర్వహిస్తామని చెప్పడం చర్చనీయాంశమైంది. జనసేన పార్టీ ఆవిర్భావం తర్వాత మూడేళ్లకు తెలంగాణలో నిర్వహించదలపెట్టిన మొదటి సభకు సంగారెడ్డిని వేదికగా చేసుకోవడం వెనుక వ్యూహామేంటనే చర్చ తెలంగాణ పొలిటికల్‌ సర్కిల్స్‌లో జరుగుతోంది.

 

జనసేన తొలి సభకు సంగారెడ్డిని వేదికగా ఎంపిక చేసుకోవడం వెనుక జగ్గారెడ్డితో ఉన్న సాన్నిహిత్యమే కారణమనే వాదన వినిపిస్తోంది. సంగారెడ్డిలో బలమైన అనుచర గణమున్న జగ్గారెడ్డి.... సభ ఏర్పాట్లతో పాటు అన్ని అంశాల్లో సహకరిస్తారనే కోణంలోనే ఈ ప్రాంతాన్ని సెలెక్ట్‌ చేసుకున్నట్లు చెబుతున్నారు. తన ప్రసంగాల్లో జగ్గారెడ్డి పేరును ప్రస్తావించడం, గతంలో పలుసార్లు ఇరువురూ భేటీ కావడం కారణం కావొచ్చంటున్నారు. 

 

ఇటీవల సంగారెడ్డి శివార్లలోని ఇస్మాయిల్‌ఖాన్‌ పేటలో షూటింగ్‌ సందర్భంగానూ పవన్‌‌తో జగ్గారెడ్డి ప్రత్యేకంగా సమావేశమవడం, పలు అంశాలపై చర్చించడం హాట్‌ టాపిక్‌గా మారింది. పైగా సందర్భం వచ్చినప్పుడు అన్ని వివరాలు చెబుతానన్న జగ్గారెడ్డి మాటలు.... ఉత్కంఠను రేపాయి. ఏదిఏమైనా తెలంగాణలో జనసేన తొలి సభ వేదికగా సంగారెడ్డిని వ్యూహాత్మకంగానే ఎంపిక చేశారనే టాక్‌ వినిపిస్తోంది.

google-ad-img
    Related Sigment News
    • Loading...