ఇప్పుడెందుకు నోరు పెగలడం లేదు పోసాని..!

posted on: Nov 23, 2017 12:18PM


నంది అవార్డుల రచ్చ ఏమో కానీ... ప్రస్తుతం పోసానీ కృష్ణ మురళీ మాత్రం హాట్ టాపిక్ అయ్యాడు. నందుల రచ్చపై ఇప్పటివరకూ ఎంతో మంది స్పందించినా.. పోసాని స్పందించినట్టు మాత్రం ఎవరూ స్పందించలేదు. కాస్త ఎక్కువగానే రెచ్చిపోయాడు. ఏదైనా కుండబద్దలు కొట్టినట్టు చెప్పడం పోసానీకి మొదటినుండి అలవాటే. ఎదుటి వారు ఎంతటివారైనా లెక్క లేకుండా ఢీకొంటాడు. అందుకే ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి కొడుకు అని కూడా చూడకుండా.. మంత్రి నారా లోకేశ్ పై విరుచుకుపడ్డాడు. నంది అవార్డుల వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం విమర్శలు చేస్తున్నందుకు..వాటిపై స్పందించిన లోకేశ్ ఏపీలో ఆధార్ కార్డ్ లేనివాళ్లు కూడా విమర్శలు చేస్తున్నారని మండిపడ్డాడు. ఇక అంతే లోకేశ్ చేసిన వ్యాఖ్యలకుగాను పోసానీ.. లోకేష్ ని తాగి మాట్లాడుతున్నావా అంటూ అందరూ షాకయ్యేలా కామెంట్లు వేశాడు. అయితే ఇక్కడే ఓ ఆసక్తికరమైన విషయం చోటుచేసుకుంది. నంది అవార్డులపై అనవసరంగా ప్రభుత్వాన్ని అంటున్నారని... లోకేశ్ అన్నందుకు పోసానీ అంతలా విరుచుకుపడుతున్నాడు..మరి ఇదే విషయంపై స్పందించిన వైసీపీ నాయకుడు సూపర్ స్టార్ కృష్ణ సోదరుడు ఘట్టమనేని ఆదిశేషగిరిరావుపై ఎందుకు నోరు పెగలడంలేదు అని అంటున్నారు.

 

నందుల రచ్చపై ఆదిశేషగిరిరావు స్పందించి పోసానికి కౌంటర్లు విసిరిన సంగతి తెలిసిందే. పోసాని వ్యవహారాన్ని అనవసర రాద్ధాంతం గా కొట్టిపారేశారు. అయినా నంది అవార్డుల్లో కులాల ప్రస్తావన ఏంటని తప్పుబట్టారు. అవార్డులు రానివాళ్లు ఏదో ఒక్కటి చెప్పి ఇలా గొడవ చేయడం మాములే అన్నారు. అయితే ఆదిశేషగిరిరావు విషయంలో మాత్రం పోసాని ఎందుకు స్పందించడంలేదు.. ఆయన గొంతు ఎందుకు ఇంకా పెగల్లేదు అని అనుకుంటున్నారు. ఎందుకంటే.. తాను అభిమానిస్తున్న జగన్ పార్టీలో నాయకుడు కావడం వల్ల ఆదిశేషగిరిరావు ని పోసాని ఏమీ అనలేకపోతున్నారా అని కొంతమంది టాక్. అంతేకాదు ఇప్పుడు మరో ఆసక్తికర విషయం కూడా బయటపడింది. అసలు లోకేశ్ పై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వెనుక ఎవరో ఒకరు ఉండి ఉంటారు... అందుకే లోకేశ్ విషయంలో అంత ఫాస్ట్ గా రియాక్ట్ అయిన పోసానికి.. ఆదిశేషగిరిరావు విషయంలో అవ్వడం పెద్ద మ్యాటరేమి కాదు.. కానీ ఆదిశేషగిరిరావు విషయంలో మాత్రం... పోసానీ గొంతు పెగలడం లేదంటే తెర వెనుక ఎవరో ఉన్నారు అని అనుకుంటున్నారు. మరి చూద్దాం.. పోసానీ రెస్పాండ్ అవుతాడో..? లేదో..?

google-ad-img
    Related Sigment News
    • Loading...