పోసానిని చూసి వణికిపోతున్న జగన్...ఎందుకో తెలుసా..?
posted on: Nov 22, 2017 10:46AM

రాజకీయాల్లో, సినీ రంగాల్లో సెంటిమెంట్లు ఉండటమనేది సహజమే. సినీ ఇండస్ట్రీలో అయితే లక్కీ నెంబర్లు, ముహూర్తాలు చూసుకుంటారు. ఇక రాజకీయాల్లోకి వస్తే ముహూర్తాలు చూడటం కంటే మనుషులను ఎక్కువగా పట్టించుకుంటారు. ఇప్పుడు వైసీపీకి అలాంటి భయమే పట్టుకుందట. ఇంతకీ ఎవరి విషయంలో వైసీపీకి అంత భయం పట్టుకుంది అనుకుంటున్నారా.. ఆ వ్యక్తి ఎవరో కాదు పోసాని కృష్ణమురళి. పోసానికి.. వైసీపీకి ఉన్న సంబంధం ఏంటీ అని అనుకుంటున్నారా..? అదెంటో తెలియాలంటే కాస్త ప్లాష్ బ్యాక్ లోకి వెళ్లాల్సిందే.
ఏ విషయాన్నైనా కుండబద్దలు కొట్టినట్టు చెప్పడంలో పోసాని కృష్ణమురళి దిట్ట. అది అందరికీ తెలిసిందే. ఆ ధైర్యంతోనే.. అప్పట్లో 2004 వ సంవత్సరంలో చంద్రబాబు మీద తీవ్ర వ్యతిరేకత ఉన్నరోజుల్లో చంద్రబాబు నాయకత్వాన్ని బలపరిచేలా టీడీపీ కి ఓటేయమని కోరాడు. ఎంతోమంది మహామహులే ఇలా అడగటానికి భయపడ్డారు. కానీ పోసాని మాత్రం ఎలాంటి భయం లేకుండా టీడీపీ కి ఓటేయమని కోరుతూ సొంత ఖర్చుతో పేపర్ ప్రకటన ఇచ్చారు. ఫైనల్ గా ఏమైంది ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయింది. ఇక ఆ తరువాత 2009 ఎన్నికలు.. వై.ఎస్ , చంద్రబాబు వంటి దిగ్గజ నేతల మధ్యలోకి ప్రజారాజ్యంతో దూసుకొచ్చారు చిరంజీవి. ఆ ఎన్నికల టైం లో పోసాని ప్రజారాజ్యం లో చేరడమే గాకుండా ఆ పార్టీ తరపున గుంటూరు జిల్లా చిలకలూరిపేట అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేసి ఓడిపోయారు. ఇక ఇప్పుడు ప్రజారాజ్యం పార్టీ ఏమైంది అందరికీ తెలిసిందే. ఆ తరువాత 2014 ఎన్నికలు... రాష్ట్ర విభజన జరిగింది. కాంగ్రెస్ కూడా రెండుగా చీలిపోయింది. వైసీపీ పేరుతో జగన్ కొత్త పార్టీ పెట్టాడు. ఇక ఈ ఎన్నికల్లో పోసానీ జగన్ కు తన మద్దతును తెలిపాడు. దురదృష్టం ఏంటంటే ఆ ఎన్నికల్లో జగన్ ఓడిపోయాడు. అందుకే ఇన్ని చూసిన తరువాత ఇప్పుడు పోసాని మరోసారి వైసీపీకి మద్దతు తెలుపుతుండటంతో... పై మూడు ఎన్నికల్లో తాను మద్దతు తెలిపిన పార్టీలకు ఎలాంటి గతి పట్టిందో అలాంటిదే తమ పార్టీకి పడుతుందేమో అని భయపడుతున్నారట. అసలే జగన్ వచ్చే ఎన్నికల్లో తానే గెలుస్తా అన్నట్టు...వచ్చే ఎన్నికల్లో తానే సీఎం అంటూ చెప్పుకుంటున్నాడు. పాపం మొన్నటివరకూ రోజా అంటే భయపడేవాళ్లు పార్టీ నేతలు.. ఇప్పుడు పోసానిని చూస్తే భయపడుతున్నారు. చూద్దాం మరి ఏం జరుగుతుందో...



.jpg)


.webp)



