ప్రశ్న రావణ్ తరఫు న్యాయవాది పొన్నవోలు.!

posted on: Jul 10, 2026 4:11PM

ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర సంచలనం సృష్టించిన యూట్యూబర్  ప్రశ్న రావణ్   అరెస్ట్ వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. దేశద్రోహ పూరిత వ్యాఖ్యలు, చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం  ఉపా  కింద నమోదైన ఈ కేసులో నిందితుడి తరఫున న్యాయపోరాటం చేసేందుకు వైసీపీ పార్టీ లీగల్ సెల్ విభాగానికి చెందిన ప్రముఖ సీనియర్ న్యాయవాది, మాజీ అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి రంగంలోకి దిగారు. గన్నవరం పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసు ఆధారంగా కోర్టులో జరుగుతున్న విచారణలో నిందితుడికి న్యాయ సహాయం అందించడానికి ఆయన ముందుకు వచ్చారు. 

ఈ వివాదాస్పద కేసులో గన్నవరం పోలీసులు నిందితుడిని మరింత లోతుగా విచారించేందుకు  10 రోజుల పాటు  కస్టడీకి ఇవ్వాలని కోరుతూ గన్నవరం కోర్టులో   పిటిషన్ దాఖలు చేశారు. పోలీసుల తరఫున దాఖలైన ఈ కస్టడీ పిటిషన్‌పై న్యాయస్థానంలో వాదనలు జరగనున్న నేపథ్యంలో..  రావణ్ తరఫున న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదించనున్నారు.   

Prasna Ravan UAPA Case, Ponnavolu Sudhakar Reddy, Joseph Ravan Arrest, Gannavaram Court News, YSRCP Legal Aid, AP Political News.

google-ad-img
    Related Sigment News
    • Loading...