అందుకే ఆర్టీసీ సమ్మెను కొనసాగనిచ్చారుట!
posted on May 15, 2015 4:12PM
.jpg)
తెలంగాణా ఆర్టీసీ కార్మికులకు ఆంధ్రా ఆర్టీసీ కార్మికుల కంటే ఒక్క శాతం అధికంగా అంటే 44శాతం ఫిట్ మెంట్ ఇస్తున్నట్లు తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన తరువాత, ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశంలో గుజరాత్ రాష్ట్రం తరువాత తెలంగాణా రాష్ట్రమే ఆర్ధికంగా బలమయిన రాష్ట్రమని అందుకే కార్మికులకు అడిగిన దానికంటే ఒక్క శాతం ఎక్కువే ఇస్తున్నామని ఆయన అన్నారు.
దానిపై తక్షణమే స్పందించిన మాజీ కాంగ్రెస్ యంపీ పొన్నం ప్రభాకర్ తెలంగాణా ధనిక రాష్ట్రమని చెప్పుకొంటున్నప్పుడు, ఆ ఇచ్చే ఫిట్ మెంట్ ఏదో కార్మికులు సమ్మె మొదలుపెట్టక ముందే ఎందుకు ఇవ్వలేదు? తొమ్మిది రోజులపాటు సమ్మె చేసిన తరువాతే ఎందుకు ఇచ్చారు? అంటే ప్రజలలో, ఉద్యోగులలో మంచి పేరు సంపాదించుకోవడానికే తప్ప వేరెందుకు కాదు. కార్మికులు కోరినట్లు ముందే వారి వేతనాలు పెంచి ఉంటే వారు సమ్మె చేసి ఉండేవారు కాదు దాని వలన ఆర్టీసీకి మరింత నష్టం వాటిల్లేది కాదు ప్రజలకూ వారం రోజుల పాటు ఇబ్బందులు తప్పేవి. కానీ కేసీఆర్ ప్రజలలో మంచి పేరు సంపాదించుకోవడానికే సమ్మె జరగనిచ్చినట్లుంది,” అని తీవ్ర విమర్శలు చేసారు.