హిడ్మా ఎన్ కౌంటర్.. ధృవీకరించిన పోలీసులు

మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో మంగళవారం (నవంబర్ 18) ఉదయం జరిగిన ఎన్ కౌంటర్ లో మావోయిస్టు అగ్రనేత హిడ్మా మరణించినట్లు అధికారికంగా పోలీసులు ధృవీకరించారు. ఈ ఎన్ కౌంటర్లో హిడ్మాతో పాటు, ఆయన భార్య   రాజీ, మరో నలుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు పేర్కొన్నారు.  ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టుల కదలికలకు సంబంధించి కచ్చితమైన సమాచారంతో మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు ఈరోజు ఉదయం కూంబింగ్ చేపట్టాయని ఏపీ డీజీపీ హరీశ్‌కుమార్‌ గుప్తా తెలిపారు.
ఇలా ఉండగా..  ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ మహేష్ చంద్ర లడ్డా రంపచోడవరంలో  మీడియా సమావేశంలో మాట్లాడుతూ మావోయిస్టు కీలక నేత హిడ్మా మృతి చెందినట్లు ప్రకటించారు.  ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో పరిణామాల కారణంగా  కారణంగా మావోయిస్టులు అక్కడి నుంచి ఏపీ వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు అందిన సమాచారంపై మావోయిస్టుల కదలికలు, కార్యకలాపాలపై నిఘా ఉంచామన్న ఆయన నిఘా వర్గాల నుంచి అందిన పక్కా సమాచారం మేరకు కూంబింగ్ నిర్వహిస్తుండగా ఎన్ కౌంటర్ జరిగిందన్నారు.  ఈ ఎన్ కౌంటర్ లో హిడ్మాతో సహా ఆరుగురు మావోయిస్టులు మరణించారని తెలిపారు. అంతే కాకుండా విజయవాడ, కాకినాడలలో 31 మంది మావోయిస్టులను అరెస్టు చేశామని వెల్లడించారు. అలా అరెస్టైన వారిలో తొమ్మిది మంది మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు ఉన్నట్లు తెలిపారు.

ఇలా ఉండగా ఒక వైపు మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఎన్ కౌంటర్ వార్త వెలువడిన వేళ.. మంగళవారం (నవంబర్ 18) విజయవాడలో మావోయిస్టుల అరెస్టు కలకలం రేపింది.  విజయవాడ పెనమలూరులో ఓ భవనంలో అద్దెకు తీసుకుని నివసిస్తున్న మావోయిస్టులను పోలీసులు అరెస్టు చేశారు.  ఈ భవనాన్ని సేఫ్ షెల్టర్ జోన్ గా చేసుకుని  కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు అందిన పక్కా సమాచారం మేరకు ఆక్టోపస్ స్పెషల్ ఆపరేషన్ నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. ఈ షెల్టర్ జోన్ నుంచి  ఏకే 47 సహా భారీగా డిటోనేటర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu